Health Tips : కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఈ మూడు డ్రింక్స్ తీసుకున్నట్లయితే డయాలసిస్ అవసరం లేదు.
Health Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవన శైలిలో, కొన్ని మార్పుల వలన ఎన్నో రోగాల బారిన పడుతున్నాము. అందులో ఒకటి కిడ్నీ సమస్య ఇది ఎంతో వేగవంతముగా, చుట్టు ముడుతుంది. ఈ కిడ్నీ సమస్య వలన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే ఈ డ్రింక్స్ తీసుకున్నట్లయితే డయాలసిస్ చేయకుండానే ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. బాడీలో ప్రధానమైన భాగం కిడ్నీ. ఇది శరీరంలోని వ్యర్ధాలను బయటకు నెట్టి వేస్తుంది. కిడ్నీలు పాడవకుండా ఉండాలంటే, కొన్ని రకాల ఆహార నియమాలను పాటించాలి. సరియైన ఆహారం తీసుకున్నట్లయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీల పై శ్రద్ధ చూపించకపోతే కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం. కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అందుకే ఆహారములో కొన్ని మార్పులు చేసుకోవాలి. కిడ్నీలు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలంటే ఈ మూడు రకాల డ్రింక్స్ ని త్రాగితే చాలు.
లెమన్ వాటర్, ఇవి శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. వేసవిలో ఈ లెమన్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. పొట్టకి సంబంధించిన సమస్యలకు లెమన్ వాటర్ మంచి ఉపశమనం ఇస్తాయి. ఈ లెమన్ లో ఉండేటటువంటి విటమిన్ సి, శరీరంలో ఆ లోటుని పూర్తిచేస్తాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు బ్యాక్టీరియాను బయటకు నెట్టేయడంలో లెమన్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వేడి నీటిలో నిమ్మరసం కలుపుకొని తీసుకున్నట్లయితే కిడ్నీలు డి టాక్స్, అవుతాయి. కొబ్బరి నీళ్లు యాలకులు ఈ నీరు వల్ల కలిగే లాభాలు అందరికీ తెలిసినవే, అయితే ఈ నీటికి తోడు యాలకులు అద్భుతమైన ఔషధముగా ఉపయోగపడతాయి. ఈ కొబ్బరి నీళ్లు నిత్యము త్రాగినట్లయితే శరీరంలో నీటి కొరత ఉండదు. అటు యాలకులు కారణంగా శరీరంలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అదేవిధంగా నోటి దుర్వాసన కూడా పోతుంది.
అలాగే కిడ్నీల సంరక్షణ కోసం ఈ కొబ్బరినీళ్లు యాలకులు మిశ్రమం అద్భుతమైన ప్రయోజనాలను కలగజేస్తుంది. కొబ్బరి నీళ్లలో ఈ యాలకుల పొడి కలిపి తీసుకోవడం వలన కిడ్నీలు డి టాక్స్ అవుతాయి. ధనియాలు అల్లం కొంతమంది ఆహారం జీర్ణం అవ్వడానికి గొంతు సమస్యలకు అల్లం ధనియాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండిటి వలన రోగనిరోధక శక్తి వేగముగా పెరుగుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి ధనియాలు అల్లం, కలిపిన నీరు అద్భుతమైన ఔషధం. అయితే వాటికోసం ఐదు గ్రాముల ధనియాలు ఐదు గ్రాముల అల్లం తీసుకొని నీటిలో వేసి, బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని చల్లార్చుకొని గోరువెచ్చగా తీసుకోవాలి ఈ విధముగా చేయడం వలన కిడ్నీలు పూర్తిగా క్లీన్ అవుతాయి.