Health Tips : ఇది పొరపాటున తింటే… మీ ప్రాణానికే ప్రమాదం…
Health Tips : చాలామంది ఆహారం వండినప్పుడు కొన్నిసార్లు అది మాడిపోతూ ఉంటుంది. అది పడేయడం ఎందుకు అని చాలామంది తినేస్తూ ఉంటారు. అలా మాడిన ఆహారాన్ని తింటే మన ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుంది. చాలామంది ఆహారం వండేటప్పుడు మాడుతూ ఉంటుంది. అలాంటి ఆహారాన్ని అసలు తినకూడదు. తింటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎన్నో నష్టాలు కలుగుతాయి. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. మన పూర్వీకులు ఆ రోజుల్లో ఎక్కువ రకాలు వండుకునేవారు కాదు. అన్నం మరియు ఒక కూరను మాత్రమే వండుకునేవారు. ఇప్పటి కాలం వారు నూనెను ఎక్కువగా వేసి వాడడం వలన అవి ఎక్కువగా మాడిపోతూ ఉంటాయి. అలాగే ఓవెన్ లో వండినవి కూడా త్వరగా మాడుతాయి.
ఇప్పుడు ఇలా మాడిన ఆహారాన్ని కూడా చాలామంది తినేస్తున్నారు. అందువల్లనే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. క్యాన్సర్ రావటానికి కారణాలైన కెమికల్స్ ఈ మాడిన ఆహారంలో తయారవుతాయి. అవి ఫ్రీ కార్బన్, హైడ్రో సైకిల్ అమైన్స్, ఆరోమెటిక్ కార్బన్స్ తయారవుతాయి. ఇవి మన శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన డిఎన్ఏ ను నాశనం చేసి అదుపు లేకుండా కొత్త కణాలు ఏర్పడడం జరుగుతుంది. ఇలా రావటానికి ఈ మార్పు ఒక కారణం. ఈ మాడిన ఆహారాన్ని తినడం వలన ఇంకొక నష్టం కూడా ఉంది. ఇలా మాడిన ఆహారం తినడం వలన రోగనిరోధక శక్తిపై పనిచేసే క్యాన్సర్ కణాలను నియంత్రించే పని ఈ రోగనిరోధక వ్యవస్థ చేయలేదు.
అంతేకాకుండా చాలామందికి ఆల్జీమర్స్ వంటి వయసు పడిన తర్వాత వచ్చే రోగాలకు ఇందులో ఉండే కెమికల్స్ కారణం అవుతాయి. అంతేకాకుండా ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాన్ని తయారుచేసి అధిక బరువు పెరిగేలా చేస్తుంది. దీనివలన గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి. మాడిన ఆహారం తినడం వలన డిటాక్స్ చేయడానికి లివర్కు ఎక్కువ సమయం పడుతుంది. మాడిన ఆహారం ఫ్రీ రాడికల్స్ ను తయారు చేస్తుంది. దీని వలన అనేక రోగాలు వస్తాయి. మాడిన కూరగాయలను తినడం వలన ఒక రకమైన కెమికల్ విడుదలవుతుంది. ఇది ఇన్ఫమేషన్ కు కారణం అవుతుంది. కనుక మాడినవి అనేక రోగాలకు కారణం అవుతాయి. కాబట్టి మాడిన ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడమే మంచిది.