Health Tips : ఈ ఒక్క ఆకుతో పంటినొప్పి, పిప్పి పళ్ళ సమస్యలను తగ్గించుకోవచ్చు… అది ఎలాగంటే…
Health Tips : ప్రస్తుతం చాలామంది పంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. పంటి నొప్పితో, పిప్పి పళ్ళతో ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడుతున్నారు. పంటి నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. ఆ నొప్పి ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ఏమి తినలేం కూడా. అలాగే జ్వరం తగిలినట్టుగా కూడా అనిపిస్తుంటుంది. అయితే పంటి నొప్పి, పిప్పి పళ్ళ సమస్యల నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి ఆయుర్వేదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క చిట్కాను ఉపయోగించి పంటి నొప్పి నుంచి పిప్పి పళ్ళ సమస్య నుంచి త్వరగా రిలీఫ్ పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జామ చెట్టు ఆకుతో పంటి నొప్పిని తగ్గించుకోవచ్చు. ముందుగా దీనికోసం 5 లేదా 6 జామ ఆకులను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తరువాత ఈ ఆకులలో రెండు గ్లాసుల నీళ్లు పోసి వాటిని ఒక గ్లాసు నీరు వచ్చేవరకు గ్యాస్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. తర్వాత మరిగిన మిశ్రమాన్ని వడగట్టి చల్లారే వరకు ఉంచాలి. తర్వాత దానిలో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు బాగా కరిగేవరకు మరిగించుకోవాలి. అలా తయారు చేసుకున్న నీటిని నోట్లో వేసుకొని బాగా పుక్కిలించాలి. ఇలా ప్రతిరోజు ఈ నీటిని పుక్కిలించడం వలన పంటి నొప్పి, పిప్పిపళ్ళ సమస్య నుంచి బయటపడవచ్చు.
జామ ఆకులతో తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతిరోజు మూడు లేదా నాలుగు సార్లు పుక్కిలించాలి. ఎటువంటి మందులు మరియు టూత్ పేస్టులు వాడకుండానే సహజంగా పంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన దంత సమస్యలు తగ్గుతాయి హాస్పిటల్స్ కి వెళ్లి వేలవేల డబ్బులు వృధా చేసే బదులు ప్రకృతిలో దొరికే ఆకులతో ఈ చిట్కాలు చేసుకొని పంటి సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇలా చేయడం వలన దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. జామ ఆకులు నోటి సమస్యలను తగ్గిస్తాయి.