Health Tips : మీ కళ్ళు ఎర్రగా మారాయా..? దానికి కారణం ఇదే.. తస్మాత్ జాగ్రత్త…!
Health Tips : కొందరి కళ్ళు చాలా ఎర్రగా మారుతూ ఉంటాయి. వాళ్ల కళ్ళని చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. అంత ఎర్రగా మారుతూ ఉంటాయి. వాళ్ల కంటిలో మంట, దురద వస్తూ ఉంటుంది. కొందరికి పొగ వల్ల కూడా కళ్ళల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. దాని మూలంగా కళ్ళు ఎర్రగా మారుతూ ఉంటాయి. కళ్ళల్లో ఒక రకమైన అలర్జీలు వలన కూడా ఇలా కళ్ళు ఎర్రబడడం మొదలవుతాయి.. చాలామంది ఎక్కువగా అర్థరాత్రి సమయంలో మేల్కొనే ఉంటారు. అప్పుడు వాళ్ళ కళ్ళు ఎర్రగా మారుతూ ఉంటాయి. కొన్ని సమయాలలో శరీరం అధిక అలసట మూలంగా కూడా కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి.
ఎరుపు కళ్ళు లేదా కంటి ఇన్ఫెక్షన్ చాలా సహజం కొన్నిసార్లు వైరస్ వల్ల కూడా కళ్ళు ఎర్రగా అవుతుంటాయి. కొందరు వాటిని అసలు పట్టించుకోరు. ఇటువంటి సమయంలో కంటిలో ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది కానే కాదు. అయితే అసలు ఈ సమస్య రావడానికి కారణమేమిటో ఇప్పుడు చూద్దాం… వైద్య నిపుణులు ఏమంటున్నారంటే : రెడ్ అయి లేదా ఐ ఇన్ఫెక్షన్ చాలా సహజమైంది అంటున్నారు. నేడు పదిమంది వ్యాధిగ్రస్తులలో ఒకరి కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కళ్ళు ఎర్రబడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇది సహజమైపోతుంది. కొన్నిసార్లు డాక్టర్ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
1) బ్లేపారిటిస్ : బ్లేపర్టీస్ అనేది కంటికి సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి బ్యాటరీ వల్ల కూడా వస్తుంది. కొన్ని సమయాలలో గడువు ముగిసిన సౌందర్య ఉత్పత్తులను వాడడం కూడా ఈ సమస్య వస్తుంది దీనికి కారణం కనురెప్పలలో వాపు ఉంటుంది. ఈ దీని కారణంగా కళ్ళు కూడా ఎర్రగా అవ్వవచ్చు..
2) అలర్జీలు : కలలో ఎటువంటి అలర్జీ వచ్చిన కళ్ళు కూడా ఎర్రగా మారుతుంటాయి. పుప్పడి అలర్జీ వల్ల చాలా సార్లు కళ్ళు ఎర్రగా అవుతుంటాయి.
3) ఇన్ఫెక్షన్స్ : కళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా మారుతూ ఉంటాయి. వైరస్ ఇన్ఫెక్షన్ మూలంగా ఎర్రటి కళ్ళు వస్తూ ఉంటాయి. మరోవైపు బ్యాటరీ వల్ల కూడా కళ్ళు ఎర్రగా మారుతుంటాయి. కాంటాక్ట్ లెన్స్ లు : ఈ కాంటాక్ట్ లెన్స్ లను వాడకం ముందు వాటిని శుభ్రం చేయరు. దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పదేపదే లెన్స్లను వాడడం రాత్రిపూట కూడా వాటిని ధరించడం వల్ల అకంత మిబా కైరా టైటిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని కొత్తగా పరిశోధనలలో బయటపడింది.
4) కోవిడ్ 19 : సహజంగా ఊపిరితిత్తులు గుండె ఇన్ఫెక్షన్తో సంబంధం ఉన్న కోవిడ్ కంటి ఇన్ఫెక్షన్ కూడా కారణమవుతుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కోవిడ్ 19 కళ్ళ ద్వారా ప్రవేశించడం వలన కంటి వెనుక మెదడుకు చేరుతుంది. కళ్ళు ఎర్రబడడం కూడా కోవిడ్ దృశ్య ప్రభావం అవ్వవచ్చు..దీనికి ట్రీట్మెంట్ : కళ్ళు ఎర్రబడడంలో ఎటువంటి ఆలస్యం చేయకూడదు అని వైద్య నిపుణులు తెలియజేయడం జరిగింది. అలాగే కళ్ళని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కళ్ళని తాకేముందు చేతులు కూడా శుభ్రం చేసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ కంటి చుక్కలను వాడండి. ఈ విధంగా చేయడం వలన కళ్ళకు ఉపశమనం కలుగుతుంది.