Heart Attack ; నిద్రలో ఈ లక్షణం కనిపిస్తే హార్ట్ ఎటాక్ వచ్చినట్లే .. వెంటనే ఇలా చేయండి ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Attack ; నిద్రలో ఈ లక్షణం కనిపిస్తే హార్ట్ ఎటాక్ వచ్చినట్లే .. వెంటనే ఇలా చేయండి ..?

 Authored By prabhas | The Telugu News | Updated on :3 April 2023,10:00 pm

Heart Attack ; ఒకప్పుడు పెద్ద వయసు వారికే హార్ట్ ఎటాక్ వచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్న జీవనశైలి కారణంగా చిన్న వయసు వారు కూడా హార్ట్ ఎటాక్ వలన చనిపోతున్నారు. అయితే వీటి యొక్క లక్షణాలను ముందుగా గమనించి సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. గుండెపోటు రావడానికి ముందుగా కొన్ని లక్షణాలు మన శరీరం మనకి చెబుతుంది. ఛాతిలో విపరీతమైన నొప్పి ఉంటుంది. అలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలుగుతుంది. శరీరం తీవ్రమైన అలసటకు గురవుతుంది. దవడ, మెడ, జీర్ణ వ్యవస్థలో నొప్పి కలగడం లాంటి లక్షణాలు కూడా గుండెపోటు యొక్క లక్షణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Heart Attack and Heart Stroke While Sleeping symptoms

Heart Attack and Heart Stroke While Sleeping symptoms

ఎడమవైపు కాని కుడివైపు కాని రెండు చేతుల్లో నొప్పి, ఛాతిలో కంగారుగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే హార్ట్ ఎటాక్ అని గుర్తించాలి. ఇలాంటి లక్షణాలు ఏమైనా అనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. డయాబెటిస్ లేదా హైబీపీ షుగర్ లెవెల్స్ కారణంగా కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ ఉండాలి. శరీరం ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్న, అధికంగా చెడు కొవ్వు పేరుకుపోతున్న, శారీరక శ్రమ లేకపోయినా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుండె విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదు. నిజానికి ఇతర సమయాల్లో కంటే ఉదయాన్నే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని

Heart Problems Why only mens

Heart Problems Why only mens

అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. మన శరీరంలో పిఏ వన్ ప్రోటీన్ పెరగడమే. ఇది రక్తం గడ్డ కట్టడం మరియు రక్తం కరగకుండా నిరోధించే ప్రోటీన్. పీఏవన్ ప్రోటీన్ స్థాయి మనం రాత్రిపూట నిద్రించాక సాధారణంగా ఉదయం 3 గంటల నుంచి ఆరు గంటల 30 నిమిషాల వ్యవధిలో మన శరీరంలో ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రోటీన్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా గుండెకు రక్తప్రసరణ తగ్గి బాగా దెబ్బతింటుంది. పడుకొని నిద్రపోయే ముందు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒత్తిడి హార్మోన్ ఈ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోవాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది