Heart Attack : ఈ బ్లడ్ గ్రూపుల వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ… వెల్లడించిన అధ్యయనాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heart Attack : ఈ బ్లడ్ గ్రూపుల వారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ… వెల్లడించిన అధ్యయనాలు…

 Authored By aruna | The Telugu News | Updated on :9 September 2022,6:30 am

Heart Attack : మన శరీరంలో నాలుగు రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఒక్కో మనిషిలో ఒక్కో బ్లడ్ గ్రూప్ ఉంటుంది. వీటిని A, B, AB, O అని పిలుస్తారు. ఈ రక్తంలో యాంటీజెన్ ల ఉనికి లేకపోవడం ఆధారంగా నిర్ణయించబడతాయి. ఎవరిలోనైనా రక్త సమూహం ప్రతికూలంగా లేదా సానుకూలంగా ఉంటుంది. ఇది రక్తంలో యాంటిజెన్ ఉనికి లేదా లేకపోవడం గురించి తెలుస్తుంది. దీనిని Rh కారకం అని కూడా అంటారు. ఒకరి బ్లడ్ గ్రూపు A లో Rh కారకం ఉంటే అతనే బ్లడ్ గ్రూప్ A పాజిటివ్ గా ఉంటుంది. అయితే ఈ మధ్యన నిర్వహించడం అధ్యయనాల ప్రకారం A, B, AB బ్లడ్ గ్రూపులో ఉన్న వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంట.

అమెరికన్ హాట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం O బ్లడ్ గ్రూప్ ఉన్న వారి కంటే A లేదా B బ్లడ్ గ్రూపులో ఉన్న వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎనిమిది రెట్లు ఎక్కువ ఉందని తెలిపింది. నాలుగు లక్షల మందిని అధ్యయనం చేశాకే ఈ విషయం తెలిసింది. ఈ విషయం యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ నిర్వహించిన అధ్యాయంలో 13.6 లక్షల మందికి పైగా దీనిపై విశ్లేషణ చేశారు. నాన్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వారి కంటే గుండె సంబంధిత సమస్యల ప్రభావం 9 శాతం ఎక్కువగా ఉందని వెల్లడించాయి.

Heart Attacks For these blood groups

Heart Attacks For these blood groups

O బ్లడ్ గ్రూప్ తో పోలిస్తే B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 15% ఎక్కువ. అయితే A బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. A బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో ప్రమాదం 11% ఎక్కువ. O నెగిటివ్ మినహా అన్ని బ్లడ్ గ్రూపులలో గుండెపోటు ప్రమాదం, రక్తం గడ్డ కట్టడం ఉంటే లక్షణాలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. రక్త గడ్డ కట్టే ప్రోటీన్ వాన్ విల్ బ్రాండ్ ఫ్యాక్టర్ నాన్ ఓ బ్లడ్ గ్రూప్ లో ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది