Tea : చాయ్ తాగుతూ ఇవి తింటున్నారా? అయితే.. మీరు ప్రమాదంలో పడ్డట్టే?
Tea : టీ లేదా చాయ్.. పేరు ఏదైనా.. ఇది లేనిదే పూట గడవదు. రోజుకు రెండు సార్లు చాయ్ Tea కడుపులో పడాల్సిందే. లేకపోతే కష్టం. ఉదయం లేవగానే.. కప్పు చాయ్ కడుపులో పడితేనే అన్ని పనులు సెట్ అవుతాయి. అలాగే.. సాయంత్రం పూట కూడా కాసింత చాయ్ కడుపులో పడాల్సిందే. ఇక.. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్లు అయితే.. రోజుకు ఎన్నిసార్లు చాయ్ Tea తాగుతారో వాళ్లకే తెలియదు. అంతలా టీ మన జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఫ్రెండ్ కలిసినా ఇంకెవరు కలిసినా.. పదా.. ఓ చాయ్ తాగొద్దాం.. అంటూ వెళ్లడమే. కాసింత అలసట వచ్చినా.. తలనొప్పి వచ్చినా.. వర్క్ లో టెన్షన్ ఉన్నా.. ప్రెజర్ ఉన్నా.. ఏది ఉన్నా.. కావాల్సింది కాసింత చాయ్.
కొందరైతే చాయ్ తో పాటు చాలా తింటుంటారు. చాయ్ Tea తాగాక కొందరు.. చాయ్ కి ముందు కొందరు ఏదో ఒకటి తినడం అలవాటు. చాలామంది చాయ్ తో పాటు బిస్కెట్లు, భజ్జీలు, పకోడీలు, మిక్సర్ లాంటివి తింటుంటారు. కొందరు కేక్ కూడా తింటారు. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి టేస్ట్ వారిది.. కాదనలేం కానీ.. చాయ్ తో పాటు.. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయట. లేనిపోని రోగాలు వచ్చి చేరుతాయట. చాయ్ తోనే కదా.. అని ఏది పడితే అది తినకూడదట. మరి.. చాయ్ తో పాటు ఏం తినకూడదో.. ఇప్పుడు తెలుసుకుందాం.
Tea : ఐరన్ ఎక్కువగా ఉండే కూరగాయలను చాయ్ తో అస్సలు తీసుకోవద్దు
చాలామంది టీతో పాటు.. కొన్ని రకాల కూరగాయలను తింటుంటారు. లేదా చాయ్ Tea ముందు.. చాయ్ తర్వాత తింటుంటారు. అసలు.. చాయ్ తాగేటప్పుడు కానీ.. చాయ్ తాగడానికి ఓ అర్ధగంట ముందు కానీ.. ఓ అర్ధగంట తర్వాత కానీ.. ఐరన్ ఎక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవద్దు. ఐరన్ కు, చాయ్ కి అస్సలు పడదు. ఇనుము ఎక్కువగా ఉండే.. కూరగాయల గింజలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు లాంటి వాటికి చాయ్ తాగే సమయంలో దూరంగా ఉండాలి.
Tea : నిమ్మకాయ, పెరుగు, పకోడీలు, ఐస్ క్రీమ్ లకు కూడా దూరంగా ఉండాలి
చాలామంది నిమ్మకాయతో చేసిన చాయ్ ని పరిగడుపునే తాగుతుంటారు. నిమ్మకాయతో చేసిన చాయ్ ని ఉదయం పూట లేవగానే మాత్రం తాగకూడదు. అలాగే.. పాలతో చేసిన చాయ్ తాగుతూ నిమ్మకాయ రసం తాగకూడదు. దానికి, దీనికి అస్సలు పడదు. అలాగే.. పెరుగు కూడా చాయ్ తాగే సమయంలో అస్సలు తీసుకోకూడదు. పెరుగు, చాయ్ Tea రెండు కలిస్తే.. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. శనగపిండితో చేసిన స్నాక్స్ ను కూడా చాయ్ తో పాటు తీసుకుంటే.. జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే.. ఓవైపు వేడి వేడి చాయ్ తాగుతూ.. మరోవైపు చల్లని ఐస్ క్రీమ్ తింటే.. జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే.. వేడి, చల్లని వస్తువుల మధ్య కనీసం ఓ అర్ధగంట అయినా గ్యాప్ ఉండాలి.