Herbal Teas : ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకోండి… కొలెస్ట్రాల్ మరియు గుండె సమస్యలకు చెక్ పెట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Herbal Teas : ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకోండి… కొలెస్ట్రాల్ మరియు గుండె సమస్యలకు చెక్ పెట్టండి…!

Herbal Teas : మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో జీవన శైలి మరియు చెడు ఆహార అలవాట్ల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం.అందులో చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె సమస్యలు వచ్చేందుకు చాలా కారణాలు కూడా ఉన్నాయి. అయితే గుండె రక్తనాళాల్లో ఫలం అనేది పేరుకుపోయి దానికి అడ్డుపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ మరియు కాల్షియం ఇతర రక్త భాగాలలో కూడా తయారు అవుతుంది. అలాగే రక్తనాళాల్లో మందపాటి పోర అనేది ఏర్పడడం వలన కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2024,7:00 am

Herbal Teas : మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో జీవన శైలి మరియు చెడు ఆహార అలవాట్ల వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం.అందులో చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె సమస్యలు వచ్చేందుకు చాలా కారణాలు కూడా ఉన్నాయి. అయితే గుండె రక్తనాళాల్లో ఫలం అనేది పేరుకుపోయి దానికి అడ్డుపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ మరియు కాల్షియం ఇతర రక్త భాగాలలో కూడా తయారు అవుతుంది. అలాగే రక్తనాళాల్లో మందపాటి పోర అనేది ఏర్పడడం వలన కూడా రక్తప్రసరణ జరగదు. దీనిని నియంత్రించేందుకు ఉదయాన్నే కొన్ని డ్రింక్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇది కొలెస్ట్రాల్ ను బయటికి పంపేందుకు,హృదయ ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఆ డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం..

Herbal Teas నిమ్మరసం

ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ నిమ్మ రసాన్ని గనక తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యంగా మారుతుంది. అలాగే ఇది గుండె రక్తనాళాలను సహజంగానే బాగుచేస్తుంది. నిమ్మకాయ లో ఉండే సిట్రస్ యాసిడ్ ఫలకాన్ని తొలగించి రక్తప్రసరణకు ఎంతో మెలు చేస్తుంది. దీని వలన జీవ క్రియ కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది..

పసుపు, మిరియాల పాలు  : దీనిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఈ పాలను తీసుకున్నట్లయితే రక్తనాళాల్లో ఫలకం అనేది తయారవ్వకుండా చూస్తుంది. అంతేకాక గుండె సమస్యల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. అయితే ఒక గ్లాసు వేడి పాలల్లో కొద్దిగా పసుపు మరియు చిటికెడు మిరియాల పొడిని వేసుకొని తాగితే చాలా మంచిది…

ఉసిరి రసం : ఉసిరి రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనిని కూడా కాళీ కడుపుతో తీసుకున్నట్లయితే గుండె కండరాలు ఎంత మెరుగ్గా తయారవుతాయి. అలాగే కొలెస్ట్రాల్ మరియు వాపు ను కూడా నియంత్రిస్తుంది…

మెంతుల నీరు : మెంతులను గనక నానబెట్టుకొని ఆ నీటిని కనుక తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. మెంతులను రాత్రి టైం లో నీటిలో నానబెట్టుకొని ఉదయం లేవగానే తీసుకుంటే మంచిది. దీని వలన రక్తనాళాల్లో పోర అనేది తగ్గుతుంది.అలాగే గుండె పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది…

వెల్లుల్లి టీ : వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో రక్షిస్తుంది. దీనిని టీ రూపంలో తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ కూడా తగ్గి రక్తనాళాల మందాన్ని కూడా నియంత్రిస్తుంది. మీరు ప్రతిరోజు గనుక గార్లిక్ టీ ని తీసుకున్నట్లయితే రక్తనాళాల్లోని అడ్డంకులు కూడా సహజంగా తొలగిపోతాయి…

గ్రీన్ టీ : గ్రీన్ టీ ని తీసుకోవటం వలన బరువు కూడా తొందరగా తగ్గుతారు. అలాగే గుండె రక్తనాళాలను శుద్ధి చేయటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తీసుకున్నట్లయితే గుండె రక్తనాళాలు ఎంతో శుభ్రంగా ఉంటాయి. అలాగే గుండె సమస్యలు కూడా దూరం అవుతాయి.

Herbal Teas ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకోండి కొలెస్ట్రాల్ మరియు గుండె సమస్యలకు చెక్ పెట్టండి

Herbal Teas : ఈ హెర్బల్ డ్రింక్స్ తీసుకోండి… కొలెస్ట్రాల్ మరియు గుండె సమస్యలకు చెక్ పెట్టండి…!

అల్లం దాల్చిన చెక్క టీ : గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఈ రెండు కూడా ముందు వరుసలో ఉంటాయి. అలాగే అల్లం రక్తనాళాల వాపును కూడా నియంత్రిస్తుంది. అయితే దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక రక్త ప్రసరణ కూడా ఎంతో మెరుగుపడేలా చేస్తుంది. ఈ రెండిటిని కలిపి టీలా చేసుకొని తాగినట్లయితే మీ బాడీలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.అలాగే గుండె రక్తనాళాలు సక్రమంగా పని చేయటంలో కూడా సహాయం చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది