amnesia : ఇలా ఒక్కసారి ట్రై చేయండి… మతి మరుపును ఈజీగా జయించొచ్చు..!
amnesia : ఏదైనా వస్తువును మనం వాడకుండా మూలన పడేస్తే కొన్నాళ్లకు అది తుప్పు పట్టి పాడై పోతుంది. మతి మరుపు amnesia కూడా ఇలాంటిదే. మైండ్ ను అంటే మెదడును వాడకపోతే అదీ పనిచేయదు. దీంతో మనకు ఏదీ గుర్తుండదు. మతి మరుపు amnesia అనే ఈ సమస్య వయసు మీద పడ్డోళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. వయసులో ఉన్నోళ్లనీ అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా చదువుకునేవాళ్లకు పరీక్షల్లో సమాధానాలు గుర్తుకు రాక మార్కులు తక్కువ వస్తుంటాయి. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు. దీనికి ఏకైక పరిష్కారం మెదడుకు మేత పెట్టడమే. అది రోజువారీ చేయాల్సిన ఎక్సర్ సైజ్. ప్రతి పనిలోనూ దీన్ని ఆచరణలో పెట్టాలి.
స్మార్ట్ ఫోన్లను సైడ్ న పెట్టి.. amnesia
ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ ప్రతిదానికీ ఫోన్ పైనే ఆధారపడుతున్నారు. కనీసం పది మంది నంబర్లనైనా సొంతగా గుర్తు పెట్టుకోవట్లేదు. అంటే మైండ్ ని పట్టించుకోవట్లేదు. బ్లాంక్ గా ఉంచుతున్నారు. లెక్కలు చేయాలంటే క్యాలికులేటర్ వాడుతున్నారు. చిన్న చిన్న ఇంగ్లిష్ పదాలకు కూడా అర్థాలను డిక్షనరీలో చూస్తున్నారు. చదవటం, రాయటం, గుర్తు పెట్టుకోవటం వంటివాటిని ఎప్పుడో మర్చిపోయారు. రోజు రోజుకీ వస్తువుల మీద ఆధారపడటం పెరుగుతోంది. తద్వారా ఒక రకంగా బ్రెయిన్ డెడ్ అవుతోంది. మెదడు మొద్దు బారిపోతోంది. క్రమంగా మనమంతా మతిమరుపు వైపు పయనిస్తున్నాం.
నూటికి 90 శాతం.. : amnesia
యంత్రాల సాయాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల మనుషుల జీవితం కూడా యాంత్రికంగా మారిపోతోంది. మతి మరుపునకు 90 శాతం ఇదే కారణమని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే మెదడుకి పని చెప్పటమే కరెక్ట్ అని సూచిస్తున్నారు. డైలీ న్యూస్ పేపర్స్, మంచి మంచి బుక్స్ చదవటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడూ మొబైల్ లో యూట్యూబ్ వీడియోలే చూస్తుంటే మైండ్ యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. పిల్లలు స్కూల్లో, కాలేజీల్లో ఇచ్చిన హోం వర్క్ చేసినట్లుగా పెద్దలు కూడా సెల్ఫ్ హోం వర్క్ చేసుకోవాలి. బుర్ర ఉపయోగించే చెస్ వంటి ఆటలాడాలి.
నలుగురిలో కాదు.. నలుగురితో నారాయణ.. amnesia
ఒంటరిగా ఉండకూడదు. దిగాలుగా కూర్చోకూడదు. ఎప్పుడూ నలుగురితో మాట్లాడుతూ ఉండాలి. వివిధ అంశాలపైన ఎదుటివాళ్లతో చర్చించాలి. కొత్త విషయాలను తెలుసుకోవటం పైన ఫోకస్ పెట్టాలి. టీవీ చూడటం తగ్గించాలి. యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఏకాగ్రతను పెంచుకోవాలి. విద్యార్థులు చదువుకున్న టాపిక్ లను ఒకటికి రెండు సార్లు మననం చేసుకోవాలి. దీంతో అవి మెదడులో ఉండిపోతాయి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఠక్కున గుర్తుకొస్తాయి. ఫోన్లు, కంప్యూటర్లు వంటి గాడ్జెట్లను అవసరమైనప్పుడే వాడాలి. అతి అనేది ఎక్కడా పనికిరాదని గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే మతి మరుపును శాశ్వతంగా మర్చిపోతారు.
ఇది కూడా చదవండి ==> అందరం చూసిన మొక్కే.. దీనివల్ల ఎన్ని లాభాలో మనకు ఇప్పటిదాకా తెలియదు..?
ఇది కూడా చదవండి ==> ఉలవచారు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు అస్సలు వదలరు…!
ఇది కూడా చదవండి ==> షుగర్ ఎందుకు వస్తుందో తెలుసా? అసలు కారణం తెలిస్తే బిత్తరపోతారు..!
ఇది కూడా చదవండి ==> రాత్రి పూట దిండు కింద వెల్లుల్లి పెట్టుకొని నిద్రపోతే బాడీ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు?