Blood Pressure : ఇంట్లో బీపీ ని చెక్ చేసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Blood Pressure : ఇంట్లో బీపీ ని చెక్ చేసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు…!

Blood Pressure : ప్రస్తుతం డిజిటల్ ఇండియా యుగంలో ఇంట్లోనే ప్రతి ఒక్కరు రక్తపోటును స్వయంగా కొలుచుకోవచ్చు. కానీ ఇది ఒక్కొక్కసారి తప్పుగా బీపీ ని చూపిస్తున్నాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలా మందికి అర్థం కాదు. కావున బీపీ కచ్చితంగా కొలిచేందుకు కొన్ని నియమాలను పాటించాలి. అలాగే మీరు బీపీ ని కొలుచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటి అంటే మోచేయి పైన చేతితో బ్రాచియల్ ఆర్టరీ ని గుర్తించాలి. అలాగే స్టెతస్కోప్ డయాఫ్రాగమ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 September 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Blood Pressure : ఇంట్లో బీపీ ని చెక్ చేసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు...!

Blood Pressure : ప్రస్తుతం డిజిటల్ ఇండియా యుగంలో ఇంట్లోనే ప్రతి ఒక్కరు రక్తపోటును స్వయంగా కొలుచుకోవచ్చు. కానీ ఇది ఒక్కొక్కసారి తప్పుగా బీపీ ని చూపిస్తున్నాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలా మందికి అర్థం కాదు. కావున బీపీ కచ్చితంగా కొలిచేందుకు కొన్ని నియమాలను పాటించాలి. అలాగే మీరు బీపీ ని కొలుచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటి అంటే మోచేయి పైన చేతితో బ్రాచియల్ ఆర్టరీ ని గుర్తించాలి. అలాగే స్టెతస్కోప్ డయాఫ్రాగమ్ ను సరైన చోట ఉంచాలి. అలాగే డయాఫ్రమ్ ను గుడ్డపై ఉంచితే డయా ఫ్రమ్ గుడ్డ యొక్క ఘర్షణ కారణాం వలన ధ్వని వినడం అనేది ఎంతో కష్టం అవుతుంది. ఈ డిజిటల్ యంత్రాన్ని వాడేటప్పుడు బ్రాచియల్ ఆర్టరీ కఫ్ చేయాలి. అంతేకాక సిస్టోలిక్ పీడనం మరియు ఒత్తిడి కొలిచేటప్పుడు కూడా వినిపించే శబ్దం మధ్య చాలా సార్లు గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీనిని ఆస్కల్టేటరీ గ్యాప్ అని అంటారు. దీనిని తగ్గించడానికి మొదట పప్పేటరీ పద్ధతిని వాడి సిస్టోలిక్ ఒత్తిడిని ఒకసారి చెక్ చేయాలి. అలాగే మీరు ధరించిన బట్టల పై బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టకపోవడమే చాలా మంచిది. అంతేకాక ఇది 5-5 mmHg యూనిట్ల ఒత్తిడి ని కూడా పెంచుతుంది. కావున బట్టలు తీసేసి చర్మం పై కఫ్ కట్టుకోవడం వలన బీపీ ఎప్పుడు కూడా కచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాక రెండు రకాల రక్తపోటు కఫ్ లు మనకు అందుబాటులో ఉన్నాయి. కావున ఒకటి మనికట్టుకు సంబంధించింది మరొకటి చేతికి కట్టుకునేది…

మీరు బీపీని కొలుచుకునేటప్పుడు ప్రశాంతంగా కూర్చోవాలి. అలాగే ఈ టైంలో ఎక్కువ మాట్లాడకూడదు కూడా. ఇది అవసరమైన ఒత్తిడి ని కలిగించగలదు. అంతేకాక రక్తపోటు ను కొలిచేటప్పుడు కుర్చీపై కూర్చొని రెండు చేతులను టేబుల్ పై పెట్టాలి. అలాగే చేతులు గుండె కు ఒకే స్థాయిలో ఉండే విధంగా పెట్టాలి. అంతేకాక బీపీ కొలిచేటప్పుడు చొక్కా స్లీవ్ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ కొలిచే కఫ్ ను మోచేయికి 2.5 సెంటీమీటర్ల పైన కట్టాల్సి ఉంటుంది. దీనిని చాలా వదులుగా లేక చాలా గట్టిగా కూడా కట్టకూడదు. అలాగే లావుగా ఉన్న వారికి మరియు పిల్లలకు వేరువేరే కఫ్ పరిమాణాలనేవి ఉంటాయి. అయితే రక్తపోటును కొలిచే ముందు మూత్ర విసర్జన కచ్చితంగా చేయాలి. తర్వాత రక్తపోటు మానిటర్ దగ్గర మొబైల్ లేక ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని అస్సలు ఉంచకూడదు. అలాగే రక్తపోటు కొలిచే ముందు టీ లేక కాఫీ లేక కెఫెన్ కలిగినటువంటి పానీయాలను కూడా అస్సలు తాగడం మంచిది కాదు…

Blood Pressure ఇంట్లో బీపీ ని చెక్ చేసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు

Blood Pressure : ఇంట్లో బీపీ ని చెక్ చేసుకునేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు…!

అలాగే రక్తపోటును కొలిచే ముందు కనీసం ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం కంపల్సరీ. అలాగే రక్తపోటును కొలిచేందుకు కనీసం 30 నిమిషాలకు ముందు ఏమీ తినకుండా ఉండటమే మంచిది. అంతేకాక మద్యం సేవించడం కూడా మంచిది కాదు. అలాగే పొగ త్రాగటం కూడా మంచిది కాదు. ఇది రక్తపోటును ఆకస్మిక పెరుగుదలకు కారణం కూడా అవుతుంది. అలాగే వ్యాయామం చేసిన వెంటనే రక్త పోటు ను చెక్ చేయడం మంచిది కాదు. ఈ టైంలో ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇలా చేయడం వలన శరీర బీపీ కొలతలు నమోదు చేయటం ఎంతో కష్టం అవుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది