Beauty Tips : మూడే మూడు రోజుల్లో ముడతలన్నింటినీ దూరం చేసే.. అద్భుతమైన చిట్కా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : మూడే మూడు రోజుల్లో ముడతలన్నింటినీ దూరం చేసే.. అద్భుతమైన చిట్కా!

 Authored By pavan | The Telugu News | Updated on :10 May 2022,3:00 pm

Beauty Tips : ముఖంపై ముడతలు, మొటిమలు, మచ్చలు అధికంగా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకునేందుకు అనేక రకాల కెమికల్ ప్రాడక్ట్స్ వాడతారు. కానీ వాటి వల్ల మచ్చలు పోయి చర్మ సౌందర్యం బాగవడం కంటే… పాడవడమే ఎక్కువవుతుంది. అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా వల్ల ఈ సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే ఆ చిట్కా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకి కావాల్సిన పదార్థాల్లో జీరక్క ఒకటి. జీరా వల్ల చర్మం క్లియర్ అవ్వడమే కాకుండా గ్లోయింగ్ స్కిన్ పొందడానికి చాలా ఉపయోగపడుతుంది. జీరాలో ఉండే పొటాషియం, సెలీనియం, కాల్షియం, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి.

ఈ అంశాలన్నింటినీ కలిపి మీ చర్మాన్ని స్పష్టంగా మెరుస్తూ.. ఉండేలా చేస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బాక్టీరియల్ గుణాలు, మొటిమలు, మచ్చలు, ఏర్పడకుండా చర్మాన్ని కాంతి వంతంగా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. ఇఫ్పుడు దీన్ని మెత్తని పొడిలా చేసి పెట్టుకోవాలి. ఒఖ గిన్నెలో ఒకటిన్నర స్పూన్ జీలకర్ర పొడి వేసి అందులో కేసర్ చందన్ అలోవెరా జెల్ వేయాలి. మీ దగ్గర తాజా అలోవెరా జెల్ ఉంటే అది ఉపయోగించుకోవచ్చు.కేసర్ చందన్ అలోవరా జెల్ చర్మానికి మద్దతునిస్తుంది. ఇది మెటిమలు, సన్ బర్న్, ముడతలు మరియు పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. మీ జెల్ ను అప్లై చేయడం వల్ల మరియు పర్యావరణ కాలుష్య కారకాల నుండి మృదువుగా రక్షించడానికి సహాయ పడుతుంది.

Beauty Tips how to get rid of skin pigmentation naturally

Beauty Tips how to get rid of skin pigmentation naturally

ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మ చెక్కను పడేయకుండా ఉంచాలి. అలాగే నిమ్మరసం పిండిన తర్వాత జీలకర్ర మిశ్రమాన్ని బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి రసం పిండేసిన నిమ్మ చెక్కతో నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న దుమ్ము, ధూళి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోయి చర్మంపై ముడతలు మచ్చలు పిగ్మెంటేన్ తగ్గిపోతుంది. నిమ్మకాయలో ఉన్న విటామిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా చేసి చర్మంపై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా చేస్తుంది. ఈ బ్యాక్టీరియా మొటిమలకు కారమం అవుతుంటాయి. ఇలా తరచుగా చేయడం వల్ల అందంగా తయారవుతారు.

Advertisement
WhatsApp Group Join Now

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది