Obesity : రోజు ఈ కూరగాయలతో ఇలా చేస్తే అధిక బరువు కు చెక్ పెట్టవచ్చు…!
Obesity ప్రస్తుతం చాలామంది అధిక బరువు, ఊబకాయం అనే సమస్యతో సతమతమవుతూ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఈ అధిక బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితం అనేది ఉండడం లేదు.. అయితే ఈ అధిక బరువును కంట్రోల్ చేయడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. కొన్ని చిట్కాలతో అధిక బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…
బరువుని తగ్గించుకోవడానికి ఇలా చేయండి .. బెండకాయ
చాలామంది పిల్లలు బెండకాయ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ కూరగాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ఏ రూపంలో నైనా తీసుకోవచ్చు..
కాకరకాయ జ్యూస్
చాలామంది కాకరకాయ తినడానికి ఇష్టపడరు. అయితే ఎన్నో వ్యాధులకు ఈ కాకరకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని నిత్యం తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది.
సొరకాయ జ్యూస్..
సొరకాయలు పోషకాలతో పాటు నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనిని వేసవిలో బరువు తగ్గాలనుకుంటే ఈ సొరకాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సొరకాయను అధికంగా తింటూ ఉంటారు సమ్మర్లో అయితే బరువు తగ్గాలనుకుంటే సొరకాయ రసం తీసుకోవచ్చు.. చాలామంది దీనిని ఇష్టపడరు..కానీ దీనిలో పీచు అధికంగా ఉంటుంది అని తెలుసుకోవాలి.
దోసకాయ జ్యూస్
వేసవిలో దోసకాయలు బాగా దొరుకుతాయి. దోసకాయలలో నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. దోసకాయ తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచుతుంది. దోసకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. దీనిలో జీరో క్యాలరీలు ఉంటాయి. ఈ దోసకాయ బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.