Curry Juice : కరివేపాకు రసం తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇక వెంటనే తాగడం మొదలు పెడతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Curry Juice : కరివేపాకు రసం తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇక వెంటనే తాగడం మొదలు పెడతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :18 October 2023,7:00 am

కరవేపాకు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు.. ఎందుకంటే అది లేకుండా కూరలు ఎక్కువగా వండరు.. కూరలో ఈ ఆకుని వేస్తే ఆ సువాసన మనకి తెలియంది కాదు.. అంత మంచి సువాసన వస్తుంది. అయితే అలాంటి కరివేపాకును తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు తెలిస్తే ఇక ఈ జ్యూస్ ని తాగడం మొదలు పెడతారు. ప్రతిరోజు ఒక గ్లాసు ఈ కరివేపాకు జ్యూస్ ని తాగినట్లయితే జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. కరివేపాకు రసం తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.. ఈ కరివేపాకుని వంటల్లో వాడడానికి బదులుగా నీటిని తాగడం వలన ఆరోగ్యానికి మంచి మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..

ఈ కరివేపాకు జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి దానిలో ఒక గ్లాస్ వాటర్ వేసి వాటిలో కొన్ని కరివేపాకు ఆకులు వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని పరిగడుపున తాగినట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ఉపయోగాలు ఏంటో చూద్దాం… శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న వ్యర్ధాలు బయటికి పోతాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. ఈ కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది.

If you know the benefits of drinking curry juice

If you know the benefits of drinking curry juice

ప్రతిరోజు ఈ నీటిని తాగడం వలన గుండె సంబంధిత సమస్యలు రావు.. గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ కరివేపాకు నీటిని తాగడం వలన ప్రేగు కదలికలు చురుగ్గా పనిచేసి మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి డిప్రెషన్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కరివేపాకులో క్యాల్షియం పుష్కలంగా ఉండడం వలన ఎముక పుష్టి అనేది లభిస్తుంది.. అలాగే ఈ కరివేపాకు జ్యూస్ ని ప్రతిరోజు ఒక గ్లాసు తాగినట్లయితే అధిక బరువు కూడా తగ్గుతారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది