Jaggery Effects : జాగ్రత్త.. చలికాలంలో బెల్లం తింటే అంతే సంగతులు..
Jaggery Effects : బెల్లం తినడం వలన చాలా చక్కటి ప్రయోజనాలుంటాయని జనరల్‌గా అందరూ అంటుంటారు. ఆరోగ్య నిపుణులు కూడా బెల్లం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తుంటారు. బెల్లంలో ఉండేటువంటి పోషకాలు మెగ్నిషియం, ఐరన్ , పొటాషియం ఇతరాలు హెల్త్‌కు చాలా మంచివని పేర్కొంటుంటారు. ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో బెల్లం చక్కటి పాత్ర పోషిస్తుంది. అయితే, చలికాలంలో బెల్లం తీసుకుంటే మాత్రం హానికరం. అలా చలికాలంలో బెల్లం తీసుకోవడం వలన కలిగే ఇబ్బందులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జనరల్‌గా బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ, శీతాకాలంలో తీసుకోవడం మాత్రం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో తీసుకోవడం వలన ఉదర సంబంధిత సమస్యలు వచ్చే చాన్సెస్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అజీర్తి సమస్యలు తలెత్తే చాన్సెస్ కూడా ఉంటాయి. వెయిట్ గెయిన్ అయ్యే చాన్సస్ కూడా ఉంటాయి. దాంతో పాటు షుగర్ లెవల్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి బెల్లం లిమిట్‌లోనే తీసుకోవడం మంచిది.బెల్లం పరిమితికి మించి తీసుకున్నట్లయితే బ్లడ్ లోపల షుగర్ లెవల్స్ బాగా పెరిగే చాన్సెస్ ఉంటాయి. బెల్లం లిమిట్‌కు మించి తీసుకున్నట్లయితేకడుపులో, నోటిలో మంట వచ్చే చాన్సెస్ కూడా ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.

jaggery be harmful to human body in winter
Jaggery Effects : శీతాకాలంలో బెల్లంతో ఈ అనారోగ్య సమస్యలు..
బెల్లంలో ఉండే సూక్రోజ్ వలన ఈ మంట సమస్య వచ్చే అవకాశాలుంటాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి లిమిట్‌గా బెల్లం తీసుకోవాలని అంటున్నారు. బెల్లంలో ఉండేటువంటి సుక్రోజ్, ఒమేగా-3 ఫ్యాట్ యాసిడ్స్ వలన హ్యూమన్ బాడీలో వాపులు వచ్చే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే బెల్లం తయారు చేసే క్రమంలో అందులో కొంత మేరకు అయినా మట్టి ఉండే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి మట్టి వలన కడుపులోకి బెల్లంతో పాటు వెళ్లి నులి పురుగులు ఉండొచ్చు. కాబట్టి ఎక్కువ మోతాదులో బెల్లం తినరాదు. బెల్లంను అధికంగా తినడం వలన హానికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా, తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.