Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – “ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!” అని. ఆ సమయంలో తిన్న కూరల వల్ల కడుపునొప్పి, విరేచనాలు వస్తాయని చెబుతుంటారు. కానీ నిపుణుల మాటల్లోకి వెళితే, ఇది పూర్తిగా నిజం కాదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతున్నారు.

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!
Monsoon Season : అలా ఏమి లేదు…
వర్షాకాలంలో ఆకుకూరలపై మట్టితో పాటు బ్యాక్టీరియా, ఫంగస్, కీటకాల గుడ్లు వంటి సూక్ష్మజీవులు ఉన్న అవకాశముంది. ఎందుకంటే ఈ ఆకులు భూమికి చాలా దగ్గరగా పెరుగుతాయి. వర్షపు నీరు నేలలోని కాలుష్యాన్ని అలుగా తెచ్చి కూరలపై పడతుంది. దీనివల్ల కొన్ని జీర్ణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వర్షాకాలంలో శరీరానికి అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఎక్కువగా ఆకుకూరల ద్వారా లభిస్తాయి. అందుకే పోషకాహార నిపుణులు ప్రతిరోజూ కనీసం 50 గ్రాముల ఆకుకూరలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఆకుకూరలు వండే ముందు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటిలో బాగా కడగాలి.మూడు సార్లు శుభ్రంగా కడగడం మంచిది.పచ్చిగా కాకుండా బాగా ఉడికించి తినాలి, తద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయి. మురికిగా ఉన్నవి, వాడిపోయిన ఆకులను తీసుకోవద్దు.తాజా, ఆకర్షణీయంగా కనిపించే ఆకుకూరలే కొనండి.సాధ్యమైతే సేంద్రీయ పద్ధతిలో పండిన ఆకుకూరలను ఎంచుకోవాలి. వీటిలో రసాయన శేషాలు తక్కువగా ఉంటాయి.వర్షాకాలంలో ఆకుకూరలు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తీసుకుంటే, అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి