Diabetes : పరగడుపున ఇవి తింటే జబ్బులన్నీ మాయం.. అవి ఏంటో తెలిస్తే వదలరిక..
Diabetes : ఆస్తమా నుంచి క్యాన్సర్ వరకు పలు అనారోగ్యాలకు ఓట్స్‌తో చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ఓట్స్ ఒక ఔషధంలా పని చేస్తుంది. ఓట్స్ మంచి పౌష్టికాహారం. దీనిలోని పీచు పదార్థం, విటమిన్ బి-2, విటమిన్ సి అధిక మోతాదులో ఉన్నాయి. అలానే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్స్ కూడా వీటిలో పుష్కలంగా దొరుకుతాయి. పిల్లలకు ఆహారంలో ఓట్స్‌ను ఏదో ఒక రూపంలో ఇవ్వడం వలన మంచి పోషక విలువలు లభిస్తాయి. ఓట్స్‌కి జిగురు గుణాన్ని తెచ్చిపెట్టే కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్‌ను వేరుచేస్తూ దాన్ని తగ్గించటంలో తోడ్పడుతుంది.
ఓట్స్‌లో విటమిన్ బి సహజంగా లభిస్తుంది. కార్పోహైడేట్లు, ప్రోటీన్స్, ఖనిజాల శాతం కూడా అధికం. నరాల బలహీనతతో పాటు నిస్సత్తువను తగ్గిస్తోంది. బరువుతగ్గాలి అనుకునేవారికి ఓట్స్ బాగా ఉపయోగపడుతుంది. బెటా గ్లూకన్ అనే పీచు పదార్థం కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతోంది. ఓట్స్‌లో ఇది మెండుగా ఉంటుంది. బెటా గ్లూకన్ ఇన్ఫెక్షన్స్‌ను కూడా దూరం చేస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.ఒక రోజుకు సరిపడా మెగ్నీషియం ( Magnesium ) కేవలం 40 గ్రాముల ఓట్స్ లో లభిస్తుంది.
Diseases : ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
మెగ్నీషియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. రక్తనాళాలు కుచించుకు పోవడాన్ని కూడా ఆపుతుంది. దీంతో గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది. ఓట్స్ రెగ్యులర్‌గా తీసుకుంటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. ఓట్స్‌లో ఉండే బీటా కెరోటిన్ అనే ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది. అధిక బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాగ్రస్తులకు ఇది మంచి ఆహారంగా పనిచేస్తుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వలన చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుంది. ఓట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేసి శరీర వాపును తగ్గిస్తాయి.