Sugarcane Juice : జాగ్రత్త : సమ్మర్ లో చెరుకు రసం తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు…!
ప్రధానాంశాలు:
Sugarcane Juice : జాగ్రత్త : సమ్మర్ లో చెరుకు రసం తాగేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతారు...!
Sugarcane Juice : సమ్మర్ లో ఎక్కువగా చల్ల చల్లని డ్రింక్స్ తాగడానికి మక్కువ చూపుతూ ఉంటారు. ఈ వేసవి కాలంలో తాగే డ్రింకులలో ముఖ్యమైన డ్రింక్ చెరుకు రసం. ఎండాకాలం మనం బయటికి వెళ్లినప్పుడు ఈ వేసవిలో వేసవి తాపం తప్పదు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసం తీసుకోవడానికి తాగుతూ ఉంటారు. బయట రోడ్లమీద చెరుకు రసం బండ్లు మనకి కనిపిస్తూ ఉంటాయి. తక్కువ ధరకే దొరికే చెరుకు రసాన్ని తాగేందుకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. వేసవిలో ఎక్కడ చూసినా జ్యూస్ షాపులు చెరుకు రసం బండ్లు అధికంగా ఉంటాయి.
చెరుకు రసం తాగడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు.చెరుకు రసంలో ఉండే గ్లూకోస్ ను శరీరంలో చాలా వేగంగా తీసుకొని వెంటనే శరీరానికి శక్తిని ఇస్తుంది. చెరుకు రసం లో విటమిన్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ చెరుకు రసం కిడ్నీలో రాళ్లు కరగడానికి రాళ్లు విచ్చిన్నమై మూత్రంలో పోవడానికి చెరుకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. చెరుకు రసం వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. దంత సమస్యలు మూత్ర సంబంధిత సమస్యలు కామెర్లు చెరుకు రసం ఒక మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది.
ఇలాంటి చెరుకు రసం ని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. ముఖ్యంగా చెరుకు రసంలో కలిపే ఐస్ ముక్కలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఐస్ తయారీలో అధికంగా నీటిని శుద్ధి చేయకుండా వినియోగిస్తారు. అందువల్ల ఐస్ లేకుండా చెరుకు రసం తాగడానికి ప్రయత్నించండి. లేకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదు.. చెరుకు రసం ఎలా తాగాలో తెలుసా.? చెరుకు రసంలో అల్లం నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచితో పాటు పోషకాలు మరో రూపంలో మారకుండా నిరోధిస్తాయి. దీంతో సహజ సిద్ధ పోషకాలు శరీరంలోకి చేరుతాయి. ఇక అల్లం వగరు రుచిని ఇవ్వడంతో పాటు నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది.