Weight loss : వేసవి కాలంలో బరువు తగ్గించే అద్భుతమైన పదార్థాలేంటో తెలుసా?
Weight loss : వేసవి కాలంలో ఎక్కువ శాతం మంది ఇంటి దగ్గరే ఉంటారు. ఎక్కువగా బయటకు కూడా వెళ్లరు. వీలయినంత ఎక్కువగా పడుకుంటారు. తినగానే పడుకోవడం వల్ల మన శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగోపోయి బరువు పెరుగుతాం. అయితే ఈ కాలంలో వ్యాయామం చేయాలంటే కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. అందుకు కారణం విపరీతమైన ఎండలు, ఒళ్లంతా చెమట పట్టడం. అందుకే ఇంట్లోనే ఉండి బరువు తగ్గించుకోవాలనుకునే వాళ్లు చాలా మంది. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన ఆహార పదార్థాలు. వీటిని సలాడ్లలో వేసి తీస్కోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా తెల్ల శనగలు.. వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం సలాడ్ లో వేసి తీసుకోవడం వల్ల చాలా లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా ఇవి బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో ప్రోటీన్, ఐరన్, పాస్పరస్, జింక్, పొటాషియం, విటామిన్ బి6, థయామిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి త్వరగా అరగకపోవడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. అయితే ఈ తెల్ల శనగలతో సలాడ్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా అలాగే ఒకటిన్నర చెంచా పచ్చి మామిడి.. స్పూన్ చొప్పున దోసకాయ, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, టొమాటో పేస్టు వేసుకొని అన్నింటిని బాగా కలపాలి.

special food items for weight loss in summer
ఆ తర్వాత రెండు టీ స్పూన్ల పైనాపిల్, యాలకుల పొడి, వేయించిన మసాలా పొడి, ఉప్పు, మిలియాలు కలిపి తీసుకోవాలి. అటు పిమ్మట గ్రౌండర్ లో బాదం, అల్లం, నిమ్మరసం, కొద్దిగా నీళ్ల వేస్తూ… కలిపి మంచి పేస్టుగా చేసుకోవాలి. దీన్ని కూడా ఈ శనగల మిశ్రమంలో వేస్కోవాలి. ఈ సలాడ్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ సలాడ్ వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉండి… బరువు తగ్గేందుకు సాయ పడుతుంది. ఇలాంటి సలాడ్ ను వారానికి రెండు మూడు సార్లు తీస్కోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఒంట్లో ఉన్న చెడు కొవ్వంతా కరిగిపోయి.. అధిక బరువును తగ్గిస్తుంది. అందుకే మీరూ ఈ వేసవి కాలంలో దీన్నోసారి ట్రై చేయండి. సలాడ్ లు తింటూనే బరువును తగ్గించుకోండి.