Hair Problems : తెల్లజుట్టుతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే జీవితంలో ఆ సమస్య రాదు..
Hair Problems : ప్రస్తుత కాలంలో తెల్లజుట్టు, చుండ్రు అనే సమస్య చాలా మందిని వేధిస్తోంది. గతంలో కేవలం ముసలి వారికి మాత్రమే తెల్లజుట్టు వచ్చేది. యువకులు, చిన్నిపిల్లల జుట్టు నల్లగానే ఉండేది. కానీ ప్రస్తుతం పోషకాలు, విటమిన్ లోపం వల్ల చిన్న, పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు ఇబ్బంది పెడుతోంది. మరి వీటిని తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో ట్రీట్ మెంట్స్ తీసుకుని ఉంటారు. కానీ వాటి వల్ల ప్రయోజనం లేకపోవడం నిరుత్సాహానికి గురవుతారు. మరి కొందరు హెయిర్ డై లాంటివి యూజ్ చేస్తారు.
వీటిని యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. దీనితో పాటు జుట్టు కూడా బలహీనంగా మారుతుంది. ఈ సమస్యను సహజసిద్ధంగానే అధిగమించవచ్చు. మను ఇంట్లో ఉన్న పదార్థాలను వాడి తెల్లజుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు.ముందుగా స్టవ్ పై ఓ గిన్నె పెట్టండి. అందులో ఓ గ్లాసు వాటర్ పోయండి. అందులో కొంచెం టీ పౌడర్ వేయాలి. తర్వాత నాలుగైదు లవంగాలు, ఓ రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఈ నీటిని బాగా మరిగించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టాలి.
Hair Problems : ఇలా చేయండి
మరో గిన్నెలో రెండు లేదా మూడు స్పూన్ల వరకు హెన్నా పౌడర్ తీసుకోవాలి. ఇంతకు ముందు మరిగించిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఇందులో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. పేస్టుగా మారే వరకు కలిసి మూత పెట్టెయ్యాలి. దీనిని మూడు నుంచి నాలుగు గంటల వరకు అలాగే ఉంటాలి. తర్వాత దానిని వెంట్రుకలకు అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల జుట్టు సమస్య తగ్గి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.