Hair Problems : స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూస్తే పేలు వస్తాయట… నిపుణులు ఏమంటున్నారంటే…
Hair Problems : చాలామందికి తలలో పేలు పడి పెద్ద సమస్యగా మారుతుంది. ఈ పేలు అనేవి అన్ని వయసుల వారి తలలో ఏర్పడతాయి. ముఖ్యంగా స్కూల్, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యను ఎదుర్కొనని వారు ఎవరు ఉండరేమో. తలలో పేలు పడితే తలంతా చికాకు పెడుతుంది. అంతేకాకుండా దురద బాగా వస్తుంది. అప్పట్లో అమ్మమ్మ, నాన్నమ్మలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని తీరికగా పేలు తీసేవారు. కానీ ప్రస్తుతం జనరేషన్ బిజీ లైఫ్ స్టైల్ వలన పేలు తీసేవారు లేకుండా పోయారు. తలలో పేలు పడుతూ కొందరు రకరకాల ఆయిల్స్ వాడేస్తుంటారు.
వీటితో కలిగే లాభం కన్నా జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే పేలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే పేలు గుడ్ల నుంచి వస్తాయి. ఇద్దరు వ్యక్తులు పరస్పరం తాకినప్పుడు పేలు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. ఇవి మనిషి రక్తాన్ని ఆహారంగా తీసుకొని జీవిస్తుంటాయి. పెద్దలతో పోల్చితే పిల్లలకు పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలను చూడగానే ఎత్తుకోవాలనిపిస్తుంది. ముద్దాడాలనిపిస్తుంటుంది. ఇలా చేసిన సమయంలో వారి తలలో ఉండే పేలు మనకి ఎక్కుతాయి. అంతేకాకుండా పొడవైన జుట్టు ఉండడం వలన కూడా పేలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూస్తే పేలు వస్తాయన్న విషయంపై నిపుణులు కొన్ని విషయాలను వెల్లడించారు. వాస్తవానికి స్మార్ట్ ఫోన్ ద్వారా పేలు వ్యాపించవు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలిసి సెల్ఫీలు తీసుకునేటప్పుడు, వీడియోలు, ఫోటోలు కలిసి చూసే సమయంలో వారి తలలు దగ్గరగా ఉంటాయి. అప్పుడు ఒకరు జుట్టు మరొకరి జుట్టుకు తాకుతుంది
దీంతో పేలు ఈజీగా ఎక్కుతాయి. కొత్త వ్యక్తిని తాకగానే పేలు వెంట్రుకలను పాకుతూ వెళ్ళిపోతాయి. వేరే వారి తలపైకి చేరి గుడ్లు పెట్టేస్తాయి. అలా తమ సంతతిని పెంచుకుంటూ పెద్ద సమస్యగా మారుతాయి. పేల సమస్య ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.