Women : ఈ వ్యాధి ప్రమాదం కేవలం స్త్రీలకు ఎక్కువ.. జాగ్రత్త సుమా లేదంటే… టపా కట్టేస్తారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Women : ఈ వ్యాధి ప్రమాదం కేవలం స్త్రీలకు ఎక్కువ.. జాగ్రత్త సుమా లేదంటే… టపా కట్టేస్తారు..?

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2025,1:00 pm

Women  : సాధారణంగా భారతదేశంలో మహిళల కే ఎక్కువగా ఈ రావడం పరిశోధనలో గమనించారు. ఆ వ్యాధి రక్తహీనత. దీనిని ఎనీమియా అని కూడా అంటారు. మన భారతదేశంలో 57% మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాలు లోపం జరిగితే రక్తహీనత ఏర్పడుతుంది. ఇది ఇనుము, విటమిన్ బి12 లోపం, అధిక రక్తస్రావం ప్రధాన కారణాలు.
వైద్య నిపుణులు అభిప్రాయం ప్రకారం, ఎనీ మియా సమస్య చాలా మందిని ప్రభావితం చేసే సాధారణ సమస్య అని చెప్పారు. దీనిని అంత తేలిగ్గా విస్మరించకూడదు. ఎందుకంటే త్రీవ్రమైన రక్తహీనత ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తదుపరి మరణానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంది.

Women ఈ వ్యాధి ప్రమాదం కేవలం స్త్రీలకు ఎక్కువ జాగ్రత్త సుమా లేదంటే టపా కట్టేస్తారు

Women : ఈ వ్యాధి ప్రమాదం కేవలం స్త్రీలకు ఎక్కువ.. జాగ్రత్త సుమా లేదంటే… టపా కట్టేస్తారు..?

Women   రక్తహీనత అంటే ఏమిటి

డాక్టర్ సోనియా రావత్ గారి వివరణ ప్రకారం, హిమోగ్లోబిన్ లేదా ఎర్ర రక్త కణాల లోపం ఉన్నప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది దీన్నే ఎనిమియా (Anemia) అంటారు. హిమోగ్లోబిన్ అనేది రక్తంలోని ప్రోటీన్. ఊపిరితిత్తుల నుండి శరీరంలో ఇతర భాగాలకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. గ్లోబిన్ శాతం తక్కువగా ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో అలసట,బలహీనత,తలనొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం, శ్వాస ఆడక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రక్తహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి : . ఇనుము, విటమిన్ బి12 లేదా పోలికామ్లం లోపం.
. అధిక రక్తస్రావం ( మహిళలో రుతుస్రావం ).
. ఇక బ్లీడింగ్ జరిపే వ్యాధులు.
. పోషకాల లోపం ఉన్న ఆహారం తినడం.
. దర్భాధారణ సమయంలో తగినంత పోషక ఆహారం తీసుకోవడం.

కేవలం మహిళలో మాత్రమే రక్తహీనత ఎక్కువ ఎందుకు : డాక్టర్లు చెప్పిన ప్రకారం మహిళల్లో రక్తహీనతకు గల కారణం మృతుస్రావమే ప్రధాన కారణం అని రుజువు చేశారు. ప్రతినెలా అధికారక్త నష్టం వల్ల ఇనుము లోకం ఏర్పడుతుంది. సాధారణ సమయంలో కూడా మహిళలకు తగినంత ఇనుమును పొందకపోతే ఇది రక్తహీనతకు దారి తీసే ప్రమాదం ఉంది.

ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలు: పాలకూర, బీన్స్, కాయ ధాన్యాలు, గింజలు, విత్తనాలు, గుడ్లు, మాంసాహారం.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు: నిమ్మకాయ, నారింజ, బొప్పాయ, స్ట్రాబెరీ.

ఇనుము సప్లిమెంట్ లో అవసరమా ..?
రక్తహీనత తీవ్రంగా ఉంటే… వైద్యులు ఐరన్ సప్లిమెంట్లను సూచిస్తారు. అయితే, కేవలం టాబ్లెట్స్ తీసుకోవడం కాకుండా, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ముఖ్యం. చాలా తీవ్రమైన పరిస్థితుల్లో IV ఐరన్ తెరఫీ ఇవ్వవచ్చు.

జీవనశైలిని మార్చుకోవడం ఎంత అవసరం: నిత్యం వ్యాయామాలు చేయాలి. తగినంత నిద్ర పోవాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. శరీరాన్ని హైట్ రేట్ గా చేసుకోవాలి.
రక్తహీనతను నిర్లక్ష్యం చేయకుండా, తగిన ఆహారం, వ్యాయామాలు, వైద్యుల సలహాలు పాటిస్తే దాని నుండి బయటపడవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది