Custard Apple : సీతాఫలాలను అధికంగా తినేవారు… ఈ సమస్యలు తప్పవు… జాగ్రత్త…!!
ప్రధానాంశాలు:
Custard Apple : సీతాఫలాలను అధికంగా తినేవారు... ఈ సమస్యలు తప్పవు... జాగ్రత్త...!!
Custard Apple : శీతాకాలం వచ్చింది అంటే చాలు మనకు వెంటనే గుర్తొచ్చే పండ్లలో సీతాఫలం ఒకటి. అలాగే సీతాఫలం రుచిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీనితో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే వైద్యులు కూడా శీతాకాలం ఎక్కువగా తీసుకోవాలి అని తరచుగా చెబుతూ ఉంటారు. అయితే అతిగా తినటం వలన అనర్ధానికి దారితీస్తున్నట్లు సీతాఫలాలు కూడా అధికంగా తీసుకుంటే లేని పోని సమస్యలు వచ్చి పడతాయి అని అంటున్నారు. అలాగే ఈ సీతాఫలంలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం,మెగ్నీషియం, విటమిన్ బి6 లాంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచటంలో హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు మాత్రం సీతాఫలాలు అస్సలు తినకూడదు అని అంటున్నారు…
సాధారణంగా మనలో చాలా మంది సీజన్ తో సంబంధం లేకుండా జలుబు మరియు దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అటువంటి వారు సీతాఫలాలు తీసుకోకుండా ఉండటమే మంచిది అని అంటున్నారు. అలాగే చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా వీలైనంత వరకు సీతాఫలాలకి దూరంగా ఉంటేనే మంచిది అని అంటున్నారు. అంతేకాక కొందరులో సీతాఫలాలు తినడం వలన చర్మం పై దద్దుర్లు మరియు దురద లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఇకపోతే సీతాఫలంలో ఫైబర్ అనేది చాలా అధిక మొతాదులో ఉంటుంది. అలాగే ఇది ఎంతో తీవ్రమైన కడుపు నోప్పి కి కూడా దారితీస్తుంది అని అంటున్నారు నిపుణులు. నిజం చెప్పాలంటే ఫైబర్ అనేది జీర్ణవ్యవస్థకు మేలు చేయడంలో ఎంత నిజం ఉన్నదో,సీతాఫలాలను అధికంగా తీసుకోవడం వలన అదే స్థాయిలో దుష్ప్రభావాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు…
ముఖ్యంగా చెప్పాలంటే వాంతులు మరియు విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు. అంతేకాక నరాల సమస్యతో ఇబ్బంది పడే వారు కూడా సీతాఫలాలు వీలేనంత వరకు తక్కువగా తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ మందులు వాడేవారు సీతాఫలాలకు దూరంగా ఉండటమే మంచిది. దీనిలో ఉండే అనోనాసిన్ అనే టాక్సిన్ మన శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. ఇకపోతే గర్భిణీలు కూడా సీతాఫలాలకు దూరంగా ఉంటేనే మంచిది అని అంటున్నారు. అలాగే కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా గింజలను తినడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే డయాబెటిస్ మరియు ఆస్తమాతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పండుకు వీలైనంత వరకు దూరంగా ఉంటేనే మంచిది