Diabetes : మీ నోటిలో ఇటువంటి లక్షణాలున్నాయా.. బీ కేర్‌ఫుల్.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి..
Diabetes : దేశంలో డయాబెటిస్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మధుమేహం బారిన పడిన వారు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కనుక ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే చాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.చికిత్స కంటే నివారణే మేలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, మధుమేహం విషయంలోనూ ఆ సూత్రం వర్తిస్తుంది. మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడి, శారీక శ్రమ వలన చాలా మంది చిన్న.
వయసులోనే రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కాగా, ఆ క్రమంలోనే మధుమేహం బారిన పడే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది రాకమునుపే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ డయాబెటిస్ ఆల్రెడీ వచ్చిందా లేదా అనేది కూడా తమకున్న లక్షణాల ఆధారంగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.లక్షణాల ద్వారా వ్యాధిని వైద్యులు నిర్ధారించి రాకుండా జాగ్రత్తలు చెప్తారు. డయాబెటిస్ వచ్చే వారిలో నోటి లోపల ఎప్పుడూ నొప్పిగా ఉంటుంది. ఇకపోతే చిగుళ్లు కూడా వాపు వచ్చినట్లుగా కనబడుతుంటాయి. అటువంటి లక్షణాలు ఉంటే కనుక మీరు వెంటనే వైద్యులను కలవాల్సి ఉంటుంది. ఇకపోతే మధుమేహం ఉన్న వారికి పెదవులు పొడి బారి ఉంటాయి.

The signs of diabetes be Consult a doctor immediately
Diabetes : జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతులు..
దాంతో పాటు నాలుకపైన తెల్లని పూత ఉంటుంది. పుండ్లు కూడా అయి ఉంటాయి. ఒకవేళ అవి చాలా కాలం పాటు తగ్గనట్లయితే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. ఫుడ్ తీసుకునేపుడు నమలడం, మింగడం కష్టమయినా డయాబెటిస్ లక్షణంగా భావించాల్సి ఉంటుంది. ఇకపోతే మధుమేహం మొదటి దశలో చిగుళ్ల నుంచి రక్తం వస్తుంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. నోటి నుంచి దుర్వాసన వచ్చినా అనుమాన పడాల్సి ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారి బాడీ డీహైడ్రేట్ అవుతుంటుంది కూడా. కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.