Chapati : రాత్రి సమయంలో చపాతీలు తింటున్న వారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి…!!
Chapati : ప్రస్తుతం మనం ఉన్న కాలంలో చాలామంది అధిక బరువు తగ్గించుకోవడం కోసం అలాగే డయాబెటిస్ లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు షుగర్ కంట్రోల్లో ఉండడం కోసం రాత్రి సమయంలో అన్నం మానేసి చపాతీని తింటూ ఉంటారు. అయితే ఎన్నో రోజులుగా ఉన్న అన్నం తినే అలవాటును ఉన్నఫలంగా మార్చుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నిత్యం చపాతీలను తినే అలవాటును చేసుకునే ముందుగా కొన్ని జాగ్రత్తలు వహించాలి. లేకపోతే ఎన్నో కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుపుతున్నారు. దానివలన రాత్రి పూట పూర్తిగా అన్న మానేసి దాని స్థానంలో చపాతి తినే బదులు అన్నం తక్కువగా తిని మిగతా భాగం చపాతీలు తీసుకోమని చెప్తున్నారు.
ఆరోగ్య నిపుణులు అయితే అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తినే చపాతీలు కంటే మధ్యాహ్నం చేసుకొని రాత్రికి తినడం మంచిదట అయితే చపాతీలలో నూనె కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఏదైనా ఆహారం ఎక్కువసేపు నిలవ ఉంచితే దానిలోని పోషకాలు నిర్విర్ణమైపోతాయి. అయితే చపాతీలు రోటీలు ఎంత ఎక్కువ సేపు నిలువ ఉంచితే ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుందట. ఆ నేపథ్యంలో చపాతీలను తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. చపాతి ఉపయోగాలు; నిద్రపోయేటప్పుడు శక్తి నామమాత్రంగానే ఖర్చు అవుతూ ఉంటుంది. మనలోని క్యాలరీలు ఏమాత్రం తగ్గవు. కావున రాత్రి టైం లో అన్నం తినడం వల్ల అది ఖర్చు అవ్వకపోవడంతో కొవ్వుగా మిగిలిపోతుంది. కావున మనిషి అధిక బరువు పెరిగిపోతూ ఉంటారు.
అందుకే రాత్రివేళ చపాతీలు తినడం మంచిదని ఎంపిక చేశారు. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోవడం మరింత ఆరోగ్యానికి ప్రమాదకరం. రాత్రి సమయంలో భోజనం బదులుగా చపాతి తింటే బాగుంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ప్లేటు నిండుగా భోజనం చేసిన రెండు మూడు చపాతీలు తిన్న ఒకటేనని డాక్టర్లు చెప్తున్నారు. అన్నం కంటే చపాతీలు శరీరానికి అధిక శక్తిని అందిస్తాయి. గోధుమలలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. చపాతీని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువ కలుగుతాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచిది. చపాతీకి వినియోగించే గోధుమలలో ఎటువంటి కొవ్వు పదార్థాలు ఉండవు. విటమిన్ బి, కాపర్, అయోడిన్, జింక్, మాంగనీస్ ,క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఎన్నో కణజాలు అధికంగా ఉంటాయి.