Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విషయంలో శ్రద్ధగా ఉండాలి..!
ప్రధానాంశాలు:
Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విషయంలో శ్రద్ధగా ఉండాలి..!
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు సాధారణంగా ఆస్పెర్‌గిల్లస్ నైజర్ అనే శిలీంధ్రం (ఫంగస్) వల్ల ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలను మూసివేసిన సంచుల్లో లేదా గాలి ప్రవేశం లేని కంటైనర్లలో ఉంచినప్పుడు, ముఖ్యంగా తేమ ఉండే వాతావరణంలో ఈ శిలీంధ్రం వేగంగా పెరుగుతుంది…

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విషయంలో శ్రద్ధగా ఉండాలి..!
Onions Black Spots ఇలా చేస్తే సమస్య లేదు..
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నల్లటి మచ్చలు పెద్దగా హానికరం కావు. ఉల్లిపాయపై ఉన్న ఫంగల్ పొరను పూర్తిగా శుభ్రంగా తీసేసి, బాగా కడిగి వాడితే ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదంటున్నారు. అయితే, శిలీంధ్రాల వల్ల కొన్ని మినిమల్ టాక్సిన్లు విడుదల కావచ్చు కనుక శ్వాస సంబంధిత సమస్యలు, అలెర్జీలు ఉన్నవారు వీటిని తినకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
నల్ల మచ్చలతో ఉన్న ఉల్లిపాయలు పై తొక్కను తీసేసి బాగా కడగాలి. పూర్తిగా నలిగినవి లేదా దుర్వాసన వస్తే ఉపయోగించకూడదు. నిపుణుల మాట ప్రకారం, ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం సరైనది కాదు. ఫ్రిజ్ వాతావరణం ఉల్లిపాయల్లో తేమను పెంచి ఫంగస్ అభివృద్ధికి అనుకూలంగా మారుతుంది. శ్వాస సంబంధిత వ్యాధులు, అలెర్జీలు ఉన్నవారు నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలు తినడం మానేయాలి.సాధ్యమైనంతవరకూ శుభ్రంగా ఉంచిన, గాలి ఆడే ప్రదేశంలో నిల్వ చేసిన ఉల్లిపాయలనే వాడాలి.ఉల్లిపాయలపై నల్ల మచ్చలు కనిపించినా వెంటనే పారవేయాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతిలో శుభ్రపరిచి వాడితే ప్రమాదం లేదు.