Holi : హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి… ప్రతి ఒక్కరు తెలుసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Holi : హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి… ప్రతి ఒక్కరు తెలుసుకోండి…!

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Holi : హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి...ప్రతి ఒక్కరు తెలుసుకోండి...!

Holi : పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే హోలీ పండుగ రానే వచ్చింది. ఇక ఈ హోలీ పండుగ రోజు రంగుల్లో తడిసి ముద్దవ్వాలని అందరూ ఇష్టపడతారు. కానీ ఈ రంగులు అనేవి మొఖం మరియు శరీరం పై పడితే శుభ్రం చేసుకోవడం కాస్త కష్టమని చెప్పాలి. అంతేకాక ప్రస్తుతం మార్కెట్ లో లభించే రంగుల్లో వివిధ రకాల రసాయనాలు ఎక్కువగా వాడుతున్నారు.వీటి వలన కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. అయితే ఈ హోలీ పండుగ ఆడేముందు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆడపిల్లలైనా సరే అబ్బాయిలైనా సరే ప్రతి ఒక్కరికి చర్మ సంరక్షణ అన్నది చాలా ముఖ్యం.అందుకే హోలీ పండుగ రోజు ప్రతి ఒక్కరు వారి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కావున హోలీ పండుగ రోజు మన చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Holi : లోషన్ పూసుకోవడం

అయితే హోలీ పండుగ రోజు లేదా హోలీ ఆడటానికి ఒకరోజు ముందు చేతులు మరియు ముఖాన్ని కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా అబ్బాయిలు గడ్డానికి జుట్టుకు కూడా నూనె ను బాగా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొబ్బరి నూనె రాయటం వలన అది మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది. తద్వారా హోలీ పండుగ తర్వాత ఎన్ని రంగులు మీ మొఖానికి అంటిన సరే ఇట్టే పోతాయి..

Holi : ఫుల్ స్లీవ్ దుస్తులు

హోలీ పండుగ రోజు మొఖంతో పాటు చేతులు కాలపై కూడా రంగులు పడతాయి. కావున చేతులు , కాళ్ల చర్మాన్ని రక్షించుకోవడానికి ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించడం మంచిది. అదేవిధంగా చెప్పులకు బదులు షూ ధరించడం వలన పాదాల చర్మం కూడా రక్షించబడుతుంది.అదేవిధంగా హోలీ పండుగ రోజు మీరు మీ చర్మాన్ని రంగుల మయం కాకుండా కాపాడుకోవాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్ స్క్రీన్ రాసుకోండి. కొద్దిసేపటి తర్వాత పెట్రోలియం జెల్ ని అప్లై చేయండి. తద్వారా చర్మాన్ని రక్షించగలుగుతారు .

Holi హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి ప్రతి ఒక్కరు తెలుసుకోండి

Holi : హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి… ప్రతి ఒక్కరు తెలుసుకోండి…!

Holi : రంగులు ఉంటే

అయితే హోలీ ఆడిన తర్వాత ముఖంపై రంగులు ఉన్నట్లయితే అదే పనిగా సబ్బుతో అసలు ఫేస్ వాష్ చేయకూడదు. రెండు మూడు రోజుల్లో అవే క్రమంగా కనిపించకుండా పోతాయి. కానీ ఒక్కరోజులో అన్ని పోవాలని అదే పనిగా సబ్బుతో రుద్దితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది