Today Horoscope : నవంబర్‌ 27 శనివారం ఈరాశి వారు శ్రీ శ్రీనివాస గద్యం వినండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Horoscope : నవంబర్‌ 27 శనివారం ఈరాశి వారు శ్రీ శ్రీనివాస గద్యం వినండి

 Authored By keshava | The Telugu News | Updated on :26 November 2021,10:00 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు బంధవులు, స్నేహితులు మీ అవసరాలను తీరుస్తారు. పనులు ఎక్కువగా ఉండటం వల్ల శ్రమ అధికమవుతుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చిల్లర వ్యాపారులకు అనుకూలంగా ఉంది. సమాజంలో మీకు మర్యాద పెరుగుతుంది. శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయండి మంచి ఫలితం వస్తుంది. వృషభ రాశి ఫలాలు : ఈరోజు సంతోషం నిండిన రోజు. చాలా కాలంగా ఎదురుకుంటున్న సమస్యలు మీకు తీరుతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి నిపుణులకు మంచిరోజు ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వకండి. శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు.ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామికి దీపారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ఈరోజు ఆనుకోని ఆందోళన మనసులో చేరుతుంది. కానీ ధైర్యంగా ఉండండి అన్నింటిని అధిగమించే శక్తి మీకు ఈరోజు గ్రహచలనాల రీత్యా కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మీరు ప్రారంభించే అవకాశం ఉంది. మిత్రుల నుంచి పూర్తిస్థాయి సహాయం, సహకారాలు అందుతాయి. శ్రీ వేంకటేశ్వర కవచం పారాయణంతో శుభం కలుగుతుంది.కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు మీకు సంతోషంతో గడుపుతారు. శారీరక శ్రమ ఉన్నప్పటికీ వాటిని పనులను పూర్తిచేస్తారు. విద్యార్థులకు శుభకాలం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. హానుమాన్‌ చాలీసా పారాయణ మంచిది.

today horoscope in telugu

today horoscope in telugu

సింహ రాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను, విలువైన వాటిని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలు కలసి వస్తాయి. అనుకోని అతిథి వస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి మాట ఇవ్వవద్దు. శ్రీలక్ష్మీ శ్రీనివాస ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు సాధిస్తారు. పనులు వేగంగా పూర్తి చేస్తారు. పెద్దల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సంఘంలో మీకు ఆదరణ పెరుగుతుంది. ఇష్టదేవతరాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి.

తులారాశి ఫలాలు : ఈరోజు ఈనెలలో మీకు మంచిని చేసే రోజుల్లో ఒకటి. విద్యార్థులకు, వ్యాపారులకు ఈరోజు మంచి రోజు. కుటుంబ సభ్యుల ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. పెద్దల ద్వారా ఆర్థిక సహకారం లభిస్తుంది. స్వర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు ధైర్యంగా పనులు పూర్తిచేస్తారు. ఇష్టమైన వారిని కలిసే అవకాశం ఉంది.
ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కార్యాలయాలలో పనులు పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. శుభవార్తలు వింటారు. శ్రీ శ్రీనివాస గద్యం వినండి. మనసులో పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు కొంత జాప్యంతో పనులు పూర్తిచేస్తారు. అనుకోని వారి నుంచి ఇబ్బందులు. వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు చేసి మంచి ఫలితాన్ని పొందనున్నారు. ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోండి. శ్రీ సత్యనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు పూర్తి ఉత్సాహంగా ముందుకుపోతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న వివాహ ప్రయత్నాలు నెరవేరనున్నాయి. ప్రయాణాలు చేసే సమయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తగా వ్యవహరించండి. నవగ్రహా ప్రదక్షణలు చేయండి.

కుంభ రాశి ఫలాలు : సంతోషంతో సాగిపోతుంది ఈరోజు. ఈరోజు అనుకోకుండా ఎదురయ్యే కష్టాలను సులభంగా ఎదురుకొంటారు. కుటుంబంలో శుభకాలం. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. దేవాలయ దర్శనాలను చేస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. శ్రీకృష్ణాష్టకం చదవండి.

మీన రాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలతతో పాటు కొంత మంచి జరుగుతుంది. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ కుటుంబ అండదండలతో వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలు కలసిరావు. కార్తీక మాస పూజల్లో పాల్గొంటారు.వివాహ కార్యక్రమాలు, విందులలో పాల్గొంటారు

Advertisement
WhatsApp Group Join Now

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది