Inspirational Story : జుట్టు సమస్యలకు వృద్ద దంపతుల సొల్యూషన్.. కూతురి కోసం ప్రయోగం చేసి ఏకంగా స్టార్టప్ కంపెనీ
Inspirational Story : ఒక్కోసారి ప్రయోగాలు సక్సెస్ అయితే ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఏదో ప్రాబ్లమ్ వస్తే బయపడి అలాగే వదిలేయకుండా పోరాడి సొల్యూషన్ వెతికి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. జనరల్ గా చాలామంది సమస్య వస్తే సొల్యూషన్ వెతకకుండా ఇతరులను సంప్రదిస్తుంటారు. కానీ ఓ వృద్ద జంట తమ కూతురికి ఓ సమస్య వస్తే స్వయంగా వాళ్లే ఎంతో కష్టపడి సొల్యూషన్ కనుగొన్నారు. అంతటితో ఆగకుండా ఎంతో మందికి ఆ సమస్యను దూరం చేయడానికి ఏకంగా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…
గుజరాత్ లోని సూరత్ కి చెందిన రాధాకృష్ణ, శకుంతల దంపతులు దాదాపు 50 ఏళ్ల పాటు బిజినెస్ లు చూసుకుని 2010లో రిటైర్ మెంట్ తీసుకున్నారు. కాగా వీరి కుమార్తె హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతుండేది. ఈ సమస్యను తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడింది. ఇక కూతురి సమస్యను అర్థం చేసుకున్న ఆ దంపతులు ఏడాది పాటు జుట్టు సమస్యలపై అనేక విషయాలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నారు. జుట్టు సమస్యకు కారణాలేంటో వెతికి పట్టుకున్నారు. స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్స్ స్థాయిల అసమతుల్యత వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందిని తెలుసుకున్నారు.ఇక ఈ హార్మోన్ పని తీరుపై శోధించి సొల్యూషన్ కనిపెట్టారు.
Inspirational Story : సొంతంగా రెమిడీ తయారు చేసి..
హెయిర్ ఫాల్ ని నివారించడానికి వారే సొంతంగా హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి పూనుకున్నారు. అందుకోసం ఆముదం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇలా 50 రకాల మూలికలు పదార్థాలను ఉపయోగించి హెయిర్ ఆయిల్ తయారు చేశారు. ఈ నూనెను తమ కుమార్తె జుట్టుకు అప్లయ్ చేయగా సమస్య దూరమై తిరిగి జుట్టు పెరగడం మొదలైందంట. ఇక ఇది వర్కౌట్ అవుతుందని తెలిసి తమ బంధువులకు, ఫ్రెండ్స్ కి వాడమని చెప్పారట. మూడు నెలల తర్వాత ఫలితాలు రావడంతో ఇక అవిమీ.. హెర్బల్ పేరుతో హెయిర్ ఆయిల్ స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టారు. 85 సంవత్సరాల వయసులో కూడా సమస్యను అలాగే వదిలేకుండా సొల్యూషన్ వెతికి ఆదర్శంగా నిలిచారు.
View this post on Instagram