Inspirational : ఈ పౌడర్ వేస్తే చాలు.. క్షణాల్లో మురికినీళ్లు స్వచ్ఛమైన నీరుగా మారిపోతాయి.. వాటిని తాగొచ్చు కూడా.. దీన్ని ఎవరు తయారు చేశారో తెలుసా?
Inspirational : జలం జీవనాధారం.. ప్రస్తుతం మంచి నీరు దొరక‌్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దొరికిన్న కొంత మంచి నీటిలోనూ ఎన్నో మలినాలు. ఈ రోజుల్లో ఎరువులు, రసాయనాలు కూడా తాగు నీటిలో కలుస్తున్నాయి. వీటిని తాగినే మనిషి ప్రాణానికే ప్రమాదం.. సామాన్యులకు స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో.. భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISERB) పరిశోధకులు ఆర్గానిక్ పాలిమర్‌లను అభివృద్ధి చేశారు.ఈ పాలిమర్ పొడి.. నీటి నుంచి విషపూరితమైన పదార్థాలను తొలగిస్తుంది.. దీంతో ఆ నీరు సురక్షితంగా మారుతుంది. భోపాల్‌లోని ఐఐఎస్ఈఆర్ కెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అభిజిత్ పాత్ర నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ పాలిమర్.
. పోలార్ ఆర్గానిక్ మైక్రోపోల్యూటెంట్స్ తొలగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రయోగశాలలో పరీక్షించింది. పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో ఈ పొడిని పెద్ద ఎత్తున తయారు చేస్తే.. మంచి జరుగుతుందని పరిశోధన బృందం అభిప్రాయపడుతోంది.హైపర్‌క్రాస్‌లింక్డ్ పోరస్ ఆర్గానిక్ పాలిమర్స్ (HPOPs), పొడిని ఒక్క టీ స్పూన్ వాడితేనే ఎక్కువ ప్రాంతంలోని నీటిని శుద్ధి చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ‘ఈ ఆర్గానిక్ పాలిమర్‌లలోని ఒక టీస్పూన్.. ప్లాస్టిక్ పార్టికల్స్, పురుగుమందులు, కలుపు సంహారకాలు, ఎండోక్రైన్ డిస్‌రప్టర్‌లు, యాంటీబయాటిక్‌లు, స్టెరాయిడ్-ఆధారిత మందులు,నీటిలో ఉండే సూక్ష్మ కాలుష్యాన్ని సైతం తొలగిస్తుంది. ఒక టీస్పూన్ హెచ్పీఓపీ.. 30 సెకన్లలో.. 2 లీటర్ల నుంచి సూక్ష్మ కాలుష్య కాలకాలను తొలగిస్తుంది. ఈ పదార్థాన్ని రీ సైకిల్ చేసుకోవాచ్చు. పది సార్లు వాడినా.. దాని సామర్ధ్యం తగ్గదు.
‘- అభిజిత్ పాత్ర’గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో నీటి సంక్షోభం తీవ్రంగా ఉంది. పోర్టబుల్ నీటి యొక్క విపరీతమైన అవసరం.. ఈ సమస్యపై మేము పని చేయడానికి ప్రేరేపించింది. నీటి నుంచి వివిధ విషపూరిత సూక్ష్మ కాలుష్య కారకాలను సమర్థవంతంగా తొలగించడానికి శోషక పదార్థాలను రూపొందించడానికి మేము శాస్త్రీయ సాహిత్యాన్ని విస్తృతంగా సర్వే చేశాం. 2019 లో మా పరిశోధనలు ప్రారంభమయ్యాయి. వివరణాత్మక అధ్యయనాన్ని పూర్తి చేసి, అమెరికన్ కెమికల్ సొసైటీ, ఏసీఎస్ అప్లైడ్ మెటీరియల్స్, ఇంటర్‌ఫేస్ పీర్-రివ్యూడ్ జర్నల్‌లో ప్రచురించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది, ”అని ఆయన వివరించారు. ఈ పరిశోధనకు ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి ఫండింగ్ ఇచ్చింది. ఈ పాలిమర్ ను మరింత అభివృద్ధి చేయడానికి ఐఐటీ మద్రాస్ తో చేతులు కలపనున్నట్లు పరిశోధకులు తెలిపారు.