Inspirational : మీ శత్రువు ఎంతటి వాడైనా సరే.. ఇలా చేస్తే మీ ముందు మోకరిళ్లాల్సిందే..
Inspirational : లైఫ్‌లో ఎదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాకపోతే కొంత మందిల లక్ష్యాలు పెద్దవిగా ఉంటాయి. కొందరివి చిన్నవిగా ఉంటాయి. వాటికి అనుగుణంగా ముందుకు సాగుతుంటాయి. కానీ చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతుంటాయి. పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వారు ఇలాంటి వాటిని అసలు లెక్కచేయరు. శత్రువు ఎంతటి వాడైనా సరే వీరు వెనకడుగు వేయరు. ఎప్పటికప్పుడు సాధన చేయడం వల్ల తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ మరింత ముందుకు సాగుతుంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనే శత్రువును ఎదుర్కొనేందుకు రెడీగా ఉంటారు. నిజం చెప్పాలంటే కష్టపడటానికి, ముందుకు సాగేందుకు మనల్ని మన శత్రువులే ప్రేరేపిస్తారు.
అలాంటి వాటిపై పట్టుదలతో ముందుకు సాగి మనం విజయం సాధించేందుకు వారు కూడా ఒక విధంగా కారణమవుతారు. కానీ శత్రువుపై విజయం సాధించడం అన్ని సమయాల్లో అంత ఈజీ కాదు. అందుకు సంబంధించి కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. శత్రువును తేలిగ్గా తీసుకోవద్దు. ఆ శత్రువు బలం నీకంటే తక్కువేమీ కాదు. జాగ్రత్తగా ఉండటం అవసరం. మీ శుత్రువును తక్కువగా అంచనా వేశారో.. మీరు ఏదో ఒక సమయంలో ఓడిపోవడం ఖాయం. మీ శుత్రువు ప్రతి కదలికను గమనించాలి. అప్పుడు అతన్ని సులభంగా ఎదురుకొనవచ్చు. ప్రతి మనిషికి అతని కోసమే అన్నిటికన్నా పెద్ద శత్రువు.
Inspirational: నీ శక్తిపైన నమ్మకం ఉండాలి
మనిషి కొన్ని సార్లు కోపంలో తప్పులు చేస్తాడు. అవే శుత్రువులకు అనుకూలంగా మారతాయి. శత్రువులు మిమ్మల్ని ఎంత ప్రేరేపించిన కోపం తెచ్చుకోకుండా తెలివిగా వ్యవహరిచాలి. వారి మాటల్లో చిక్కుకున్నారో ఇక అంతే సంగతులు. ఏ నిర్ణయమైన ప్రశాంతంగా ఆలోచించుకుని తీసుకోవాలి. సహనం సైతం చాలా అవసరం. మీ లక్ష్యం పెద్దది అయినప్పుడు చాలా ఓపికతో ఉండాలి. సహనాన్ని కోల్పోవద్దు. చాలా మంది నేర్చుకునే పరిస్థితుల్లో ఓడిపోతుంటారు. ఎక్కడ లోపం తలెత్తుతుందో అంచనా వేసుకోవాలి. అనంతరం మనల్ని మనం రెడీ చేసుకోవాలి. ఇలా చేస్తే శుత్రువుపై విజయం సాధించొచ్చు.