Women : ప్రతిరోజు స్నానం చేసే ఆడవాళ్లు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Women : ప్రతిరోజు స్నానం చేసే ఆడవాళ్లు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి

Women  : చాలామంది ప్రతిరోజూ స్నానం చేస్తారు. మరి కొందరు వారంలో కొన్ని రోజులు మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయాన్నే స్నానం చేస్తే మరి కొందరు మధ్యాహ్నము లేదా రాత్రి వేళలో స్నానం చేస్తూ ఉంటారు.. స్నానం ఏ సమయంలో చేయాలి. ఎలా చేస్తే అదృష్టం పెరుగుతుంది. అనే ఆసక్తికరమైన విషయాల గురించి కూడా మీరు కచ్చితంగా తెలుసుకొని తీరాలి. మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది. ఆయుర్వేదం ప్రకారం […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,11:00 am

Women  : చాలామంది ప్రతిరోజూ స్నానం చేస్తారు. మరి కొందరు వారంలో కొన్ని రోజులు మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయాన్నే స్నానం చేస్తే మరి కొందరు మధ్యాహ్నము లేదా రాత్రి వేళలో స్నానం చేస్తూ ఉంటారు.. స్నానం ఏ సమయంలో చేయాలి. ఎలా చేస్తే అదృష్టం పెరుగుతుంది. అనే ఆసక్తికరమైన విషయాల గురించి కూడా మీరు కచ్చితంగా తెలుసుకొని తీరాలి. మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంది. ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడానికి సమయం అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి. సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా పునరుజీవింప చేస్తుంది. అత్యంత అనుకూలంగా ఉండే వేళలో ఇది ఒకటి. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు ఆనందం మంచి ఆరోగ్యం ఏకాగ్రత కూడా పెరుగుతాయి. అలాగే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య శరీరాన్ని శుభ్రం చేసుకోటానికి దేవస్థానం లేదా దేవతల స్నానం అంటారు. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మీకు కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది.

ఉదయం 6 నుంచి 8 గంటల నుంచి మనుషులు సాధారణంగా స్నానం చేసే సమయం. ఈ సమయంలో స్నానం చేయటం వల్ల అదృష్టం ఐక్యత సంతోషం పెరుగుతాయని ధర్మశాస్త్రంలో వివరించబడింది. ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడానికి రాక్షస స్నానంగా పరిగణిస్తారు. కాబట్టి ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి. కుదరకపోతే గనక సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి. అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం 8 గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే శాస్త్రాల ప్రకారం పురుషులు ప్రతిరోజు తల స్నానం చేయవచ్చు. అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు. ఒంటిమీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిలో జల దేవత ఉంటుంది. కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు శరీరాన్ని అంతా కూడా శుభ్రం చేసుకొని దాన్ని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు. అయితే అలా చేయటం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి.

అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్లో కొంత నీరు నింపి పెట్టాలి. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దవాళ్ళు మనకు శుక్రవారం అలవాటు చేశారు. కానీ ధర్మ శాస్త్రాల ప్రకారం ఆడవాళ్లు శుక్రవారం లేదా మంగళవారం తలస్నానం చేయకూడదు ఎంతో తప్పనిసరి పరిస్థితి అయితేనే చేయాలి. ఆడవారు ముఖ్యంగా తమ జీవితంలో పసుపు, కుంకుమలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండాలంటే తల స్నానం చేసే విధానం.. ఎప్పుడు చేయాలి అనేది కూడా తెలుసు ఉండాలి. స్త్రీలు శనివారం తలంటు స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది. బుధవారం చేస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత బాగుంటుంది. సోమవారం తల స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు. మీకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. భోజనం చేయగానే స్నానం చేయటం అనేది అలవాటుగా ఉన్నట్లయితే మీరు కచ్చితంగా అలవాటును మార్చుకోవాలి. భోజనానికి ముందు స్నానం చేయాల్సి ఉంటుంది. కానీ భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. ఈ విధంగా చేస్తే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే శాస్త్రాల ప్రకారం కూడా ఈ విధంగా చేయడం తప్పు..

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది