Karimnagar..పెగడపల్లిలో మంత్రి కొప్పుల పర్యటన

Authored By praveen T | The Telugu News | Published on: September 8, 2021, 10:42 am

జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పర్యటించనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. పర్యటనలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి కొప్పుల ఉదయం పది గంటలకు మండలంలోని బొంన్కూర్ గ్రామంలో, పదకొండు గంటలకు గుంజపడుగు గ్రామంలో, పన్నెండు గంటలకు నందిపల్లె గ్రామంలో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. ఇటీవల కాలంలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో మనో ధైర్యం నింపనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను పరిశీలిచడంతో పాటు ఉప్పొంగుతున్న చెరువులు, వాగుల పరివాహక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆయ ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే అవకాశముంది.

 

praveen T

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp