Platelet Count : రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గితే ఏం చేయాలి? ఏ ఫుడ్ తీసుకుంటే కౌంట్ పెరుగుతుంది?
Platelet Count : ఇది కరోనా కాలం. కరోనా వల్ల ఎప్పుడు ఏమౌతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. అందరూ టెన్షన్ పడుతున్నారు. ఈ కరోనాకు తోడు.. లేనిపోని వ్యాధులు కూడా మనల్ని వేధిస్తున్నాయి. కరోనా వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు రావడం.. గుండె జబ్బులు రావడం.. కిడ్నీ సమస్యలు రావడం పక్కన పెడితే.. చాలామందికి రక్తంలో ప్లేట్ లెట్స్ పడిపోతున్నాయి. హైఫీవర్ వచ్చినా.. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వస్తే ముందు రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోతుంది. అది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదాన్ని తీసుకొస్తుంది.
ప్లేట్ లెట్స్ తగ్గాయి అంటే.. ఎవరో ఒకరు తమ ఒంట్లోని ప్లేట్ లెట్స్ ను దానం చేయాల్సి ఉంటుంది. లేదంటే.. ఎప్పుడు ప్రాణాలు పోయేది తెలియదు. అయితే.. అసలు.. ప్లేట్ లెట్స్ పడిపోకుండా.. ఉండేందుకు.. ప్లేట్ లెట్స్ కౌంట్ ను పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకుంటే చాలు.. ప్లేట్ లెట్స్ కౌంట్ సరిపోయేంత ఉంటుంది. మరి.. దాని కోసం ఏం చేయాలి? ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Platelet Count : ప్లేట్ లెట్స్ కౌంట్ పెరగాలంటే.. బొప్పాయిని తినాల్సిందే
బొప్పాయి.. ఎన్నో సుగుణాలు ఉన్న గొప్ప పండు. దీంట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయిని నిత్యం తింటే.. ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అలాగే.. ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిన వాళ్లు.. బొప్పాయిని నిత్యం తీసుకుంటే.. వెంటనే కౌంట్ పెరుగుతుంది. భవిష్యత్తులో ప్లేట్ లెట్ కౌంట్ తగ్గకుండా చూసుకోవాలనుకుంటే.. నిత్యం బొప్పాయిని తీసుకోండి. బొప్పాయి ఆకులను కూడా తినొచ్చు. వాటిని తీసుకున్నా కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. బొప్పాయి ఆకులను ఉడకబెట్టి.. వాటి రసాన్ని తీసి ఆ తర్వాత ఆకులను తింటే.. ప్లేట్ లెట్స్ కౌంట్ వద్దన్నా పెరుగుతుంది.
ప్లేట్ లెట్స్ కౌంట్ పెరగాలంటే.. దానిమ్మను తినాల్సిందే. దానిమ్మ పండు గింజలను తిన్నా కూడా రక్తం వృద్ధి చెందుతుంది. అలాగే.. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. ఒకవేళ గింజలను తినడం ఇష్టం లేని వాళ్లు.. దానిమ్మ జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఎలా చేసినా.. ప్లేట్ లెట్స్ కౌంట్ మాత్రం పెరుగుతుంది.
గుమ్మడి కాయలో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. గుమ్మడికాయను జ్యూస్ లా చేసి కూడా తాగొచ్చు. లేదంటే.. గుమ్మడికాయను మెత్తగా పేస్ట్ లా చేసి.. ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి ఆ రసంలో కాసింత తేనె వేసుకొని తాగాలి. అలా చేస్తే.. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగినా కూడా ప్లేట్ లెట్స్ కౌంట్ పెంచుకోవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్ లో కాసింత నిమ్మరసం కలిపి.. తాగండి. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుంది.
ఇది కూడా చదవండి ==> మామూలోడు కాదు.. అన్నం తినడం ఆపేసి 9 నెలల్లో 60 కిలోలు తగ్గాడు.. ఆయన డైట్ లో ఉన్న ఫుడ్ ఇదే..!
ఇది కూడా చదవండి ==> రోజూ పెరుగు తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
ఇది కూడా చదవండి ==> శపించే మొక్కను చూశారా ఎప్పుడైనా? ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే?
ఇది కూడా చదవండి ==> ఈ చెట్టు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే?