Property Rights : తండ్రి తన ఆస్తిని వేరొకరికి ఇవ్వవచ్చా..? ఆస్తుల బదిలీలపై సందేహాలు ఉన్నాయా..? అయితే ఇది తెలుసుకోండి
ప్రధానాంశాలు:
తండ్రి తన ఆస్తిని వేరొకరికి ఇవ్వవచ్చా..? ఆస్తుల బదిలీలపై సందేహాలు ఉన్నాయా..? అయితే ఇది తెలుసుకోండి
Property Rights : భారతదేశంలో ఆస్తుల పంపకాలపై చట్టం చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ వ్యక్తి మరణించిన తరువాత ఆస్తులు ఎవరికెవరికీ లభించాలనే విషయంలో వారి మతం, ఆస్తి స్వరూపం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. హిందువులకు హిందూ వారసత్వ చట్టం వర్తిస్తే, ముస్లింలకు షరియత్ చట్టం అమలవుతుంది. అయితే చాలామంది తండ్రులు తమ ఆస్తిని పిల్లలకు కాకుండా వేరే వ్యక్తులకు ఇవ్వగలరా అనే సందేహంలో ఉంటారు. దీనికి సమాధానం – ఆస్తి స్వయంగా సంపాదించిందా, లేక పూర్వీకుల ఆస్తినా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

Property Rights : తండ్రి తన ఆస్తిని వేరొకరికి ఇవ్వవచ్చా..? ఆస్తుల బదిలీలపై సందేహాలు ఉన్నాయా..? అయితే ఇది తెలుసుకోండి
Property Rights : ఇది చదివితే ఆస్తుల బదిలీలపై మీకున్న అనుమానాలన్నీ తొలగిపోతాయి
తండ్రి తన స్వంతంగా సంపాదించిన ఆస్తిపై పూర్తి హక్కు కలిగి ఉంటాడు. అతడు ఆ ఆస్తిని తన పిల్లలకు ఇవ్వకుండా, ఇతరులకు వదిలేయవచ్చు. వీలునామా ద్వారా తన చిత్తానుసారంగా ఆస్తిని ఎవరికైనా రాసివ్వవచ్చు. 2016లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, తండ్రి సంపాదించిన ఆస్తిపై పిల్లలకు చట్టపరమైన హక్కు ఉండదు. తండ్రి తన కుమారుడికి గానీ, కుమార్తెకు గానీ ఆస్తిని ఇవ్వకూడదని నిర్ణయించవచ్చు. అయితే తండ్రి వీలునామా లేకుండా మరణిస్తే, ఆస్తి పంపకం చట్ట ప్రకారం జరుగుతుంది.
అలాగే పూర్వీకుల ఆస్తి విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆస్తి తాత, ముత్తాతల నుంచి సంక్రమించి వచ్చినదైతే, దానిపై పిల్లలకు జననంతోనే హక్కు ఉంటుంది. ఈ హక్కును తండ్రి తిరస్కరించలేడు. కుమారుడికే కాకుండా, 2005 తర్వాత హిందూ వారసత్వ చట్టం సవరణ ద్వారా కుమార్తెకు కూడా సమాన హక్కు కల్పించబడింది. మేజర్ పిల్లల అనుమతి లేకుండా తండ్రి పూర్వీకుల ఆస్తిని అమ్మితే, వారు కోర్టులో వ్యాజ్యం వేసి అమ్మకాన్ని ఆపించవచ్చు. కానీ సొంత ఆస్తి అయితే, తండ్రికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.