Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం నిర్మాణం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం నిర్మాణం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..!

Ayodhya Ram Mandir : మరికొన్ని గంటల్లోనే ప్రతి భారతీయుని హిందువుని 500 నిరీక్షణ ఫలించబోతుంది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. శ్రీరామచంద్రుడు పుట్టిన నేల పైకి సీతా సమేతంగా జగదాభిరాముడు అయోధ్యలో అడుగుపెట్టబోతున్నాడు. కొత్తగా నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12:29:08 సెకండ్లకు బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. జనవరి 24 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలోనే ఆలయ నిర్మాణ వైభవం గురించి కొన్ని […]

 Authored By aruna | The Telugu News | Updated on :22 January 2024,12:12 pm

ప్రధానాంశాలు:

  •  Ayodhya Ram Mandir : అయోధ్య రామ మందిరం నిర్మాణం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..!

Ayodhya Ram Mandir : మరికొన్ని గంటల్లోనే ప్రతి భారతీయుని హిందువుని 500 నిరీక్షణ ఫలించబోతుంది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. శ్రీరామచంద్రుడు పుట్టిన నేల పైకి సీతా సమేతంగా జగదాభిరాముడు అయోధ్యలో అడుగుపెట్టబోతున్నాడు. కొత్తగా నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12:29:08 సెకండ్లకు బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. జనవరి 24 నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ క్రమంలోనే ఆలయ నిర్మాణ వైభవం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

• సాంప్రదాయ నగరాశీలలో నిర్మించిన రామ మందిర సముదాయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తు ఉంటుంది.

• 71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి, తుపాకీ మండపం, రంగ మండపం, నృత్యం మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపంతో సహా ఆరు భాగాలుగా విభజితమై ఉంది.

• అసలు రామ మందిరానికి రూపకల్పన 1988లో అహ్మదాబాద్ లోని సోంపుర కుటుంబం చేపట్టింది. అయితే ఇది వాస్తు శాస్త్రం శిల్పా శాస్త్రాలకు అనుగుణంగా 2020లో కొన్ని మార్పులు చేశారు.

• సోంపుర కుటుంబం ప్రపంచవ్యాప్తంగా వంద దేవాలయాలను నిర్మించింది

• ఆలయ కాంప్లెక్స్ లో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020 ఆగస్టు 5న శంకుస్థాపన చేశారు.

• ఆలయ వ్యవహారాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ ట్రస్ట్ 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించింది.

• ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుమును వాడలేదు. పునాదిని 14 మీటర్ల మందపాటి కాంక్రీట్ మిశ్రమంతో వేశారు. నేల లోంచి వచ్చే తేమ నుంచి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు.

• భక్తులు సింగ్ ద్వార్ నుంచి 32 మెట్లు ఎక్కి ఆలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ర్యాంపులు, లిఫ్ట్ లు ఉంటాయి.

• మూడు అంతస్తులు ఉన్న ఆలయంలోని ఒక్కో ఫ్లోర్ 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మూడు ఫ్లోర్ల మొత్తం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీరాముని జన్మ, బాల్యాన్ని వర్ణిస్తుంది. మొదటి అంతస్తు రాముడి దర్బార్ ను వివరిస్తుంది.

• ఆలయ నిర్మాణానికి 1800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు 900 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ట్రస్ట్ తెలిపింది.

• ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ లోని భరత్ పూర్ కు చెందిన పింక్ ఇసుకరాయి బన్సీ పహార్ పూర్ ని ఉపయోగించారు.

• ఆలయానికి 12 ద్వారాలు అమర్చారు. ఆలయ నిర్మాణాన్ని ముఖ్య వాస్తు శిల్పి చంద్రకాంత్ సోంపుర, కుమారులు ఆశిష్ మరియు నిఖిల్ పర్యవేక్షిస్తున్నారు.

• రామ మందిరంలో ప్రతిష్టించే విగ్రహాలను కర్ణాటక కు చెందిన కళాకారులు గణేష్ భట్, అరుణ్ యోగిరాజ్, రాజస్థాన్ కు చెందిన సత్యనారాయణ పాండే చెక్కారు.

• గర్భగుడిలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని అల్లపల్లి అడవుల్లోని టేకును విస్తృతంగా ఉపయోగించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది