RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓట‌మితో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓట‌మితో..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 April 2025,11:40 am

ప్రధానాంశాలు:

  •   RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓట‌మితో..!

RCB  : ఐపీఎల్ (IPL) 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, సొంత మైదానంలో పరాజయం పాలైంది. ఆర్‌సీబీ జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మహ్మద్ సిరాజ్, ఆర్ సాయి కిషోర్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్‌సీబీని 169 పరుగులకే క‌ట్టడి చేశారు. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు.

RCB సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా ఆర్సీబీ ఓట‌మితో

RCB : సెహ్వాగ్ చెప్పిన మాటలు నిజం అవుతాయా.. ఆర్సీబీ ఓట‌మితో..!

RCB  పాపం.. ఆర్సీబీ

గత సీజన్ వరకు ఆర్‌సీబీ తరపున సిరాజ్.. ఇప్పుడు ఆర్‌సీబీకి వ్యతిరేఖంగా బరిలోకి దిగి 19 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. దీనికి ప్రతిస్పందనగా, జోస్ బట్లర్ హాస్ సెంచరీతో గుజరాత్ 18వ ఓవర్లలోనే మ్యాచ్ గెలిచింది. ఈ ఇంగ్లండ్ వికెట్ కీపర్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనితో పాటు, సాయి సుదర్శన్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే, ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక్క ఓటమితో ఏకంగా 3వ స్థానానికి పడిపోయింది. పంజాబ్ టీం అగ్రస్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ టీం 4వ స్థానంలో నిలిచింది. అయితే, సెహ్వాగ్ అన్నట్లుగా ఆర్‌సీబీ అగ్రస్థానం కొన్ని రోజులే, ఇప్పడే ఫొటో తీసి పెట్టుకోండన్నట్లుగానే జరిగేలా ఉందా లేదా అనేది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది