BRS leaders : వరుసగా కాంగ్రెస్ లోకి చేరుతున్న బీఆర్ఎస్ నేతలు .. కారు ఖాళీ అయినట్లేనా ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS leaders : వరుసగా కాంగ్రెస్ లోకి చేరుతున్న బీఆర్ఎస్ నేతలు .. కారు ఖాళీ అయినట్లేనా ..!

 Authored By aruna | The Telugu News | Updated on :15 December 2023,8:00 pm

ప్రధానాంశాలు:

  •  BRS leaders : వరుసగా కాంగ్రెస్ లోకి చేరుతున్న బీఆర్ఎస్ నేతలు .. కారు ఖాళీ అయినట్లేనా ..!

BRS leaders : అధికారం అనే అయస్కాంతానికి ఆకర్షితులయ్యేవారు అధికారం పోగానే దూరమవుతారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయం వెంటనే తెలిసి వస్తుంది. తాము ప్రయోజించిన అధికారయస్కాంతం ఇప్పుడు రివర్స్ అవుతుంది. నిర్మల్ మున్సిపల్ బీఆర్ఎస్ అభ్యర్థులంతా ముకుమ్మడిగా కాంగ్రెస్ లోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతర చోట్ల కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ లోకి అందరూ ఫిరాయింపులపై వచ్చినవారే. ముఖ్యంగా తిరుగులేని అధికారం ఉంటుందని, ఎంతో కొంత వెనక వేసుకోవచ్చు అని, అంతా పార్టీలో చేరిన వారే. ఇప్పుడు అధికారం పోవడంతో వారంతా పార్టీని నమ్ముకుని ఉండడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున నేతలు కాంగ్రెస్ లోకి వెళుతున్నారు.

గ్రామస్థాయి నుండి ఎమ్మెల్యే ల వరకు ఈ వలస ఉండే అవకాశం ఉందని కనిపిస్తుంది. అధికారం నుంచి ప్రతిపక్ష పాత్రకు చేరి బీఆర్ఎస్ తమ క్యాడర్లను కాపాడుకోవడం అసలైన సమస్యగా మారింది. ఇప్పటికే మునిసిపాలిటీల్లో వలస ప్రభావం కనిపిస్తుంది. పదవి కాలం ఏడాది కూడా లేకపోయినా కాంగ్రెస్ లోకి చేరి ఆ పదవులను కాపాడుకోవడమో లేదా కొత్తగా పొందడమో ఆలోచన చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం మారడం అని తెలుస్తుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాజకీయం పునరేకికరణ పేరుతో నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు. వారు పార్టీకి అవసరమా కాదా అన్నది చూసుకోలేదు. ఇతర పార్టీలకు నేతలు ఉండకూడదని, తెలంగాణలో మరో పార్టీ గెలవదని నమ్మడం, దీంతో గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకు కారు ఓవర్ లోడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది.బీఆర్ఎస్ లోకి చేరిన వారంతా కాంగ్రెస్ పార్టీ క్యాడర్స్ బీఆర్ఎస్ నేతల ఆఫర్ల వలన అందులోకి చేరారు. అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తే పదవులు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జనవరి నుంచి గ్రామ పరిషత్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికలు రెండుసార్లు నిర్వహించారు. గ్రామాల్లో పట్టు కావాలంటే అధికార పార్టీలోకి చేరాలనే సాకుతో టిఆర్ఎస్లోకి వరుసగా చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంల్లోకి రావడంతో ఈ వలస కొనసాగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కానుంది.

ఇప్పుడు రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు లేవు. అందరూ ఆర్థిక ప్రయోజనం కోసమే చూస్తున్నారు. అందుకే కేసిఆర్ తమ పార్టీలోకి నేతలను ఆకర్షించుకున్నారు. కానీ ఇప్పుడు అదే రివర్స్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వలసల ముప్పును ఆపడం కష్టం. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నేతలు కొందరు ఎప్పుడూ అధికారం పార్టీలో ఉంటారు. వారికి ఏ పార్టీ అన్నది ముఖ్యం కాదు. అందుకే అధికారం పార్టీలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ అలాంటి వారి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో అధికార పార్టీ తెలుసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది