Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు.. క‌విత కేసు వాదించిన‌ ముకుల్ రోహత్గీ ఫీజు ఎంతో తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు.. క‌విత కేసు వాదించిన‌ ముకుల్ రోహత్గీ ఫీజు ఎంతో తెలుసా ?

Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్ట‌కేల‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు అయింది. మంగళవారం సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమెకు తాత్క‌లిక ఉపశమనం లభించింది. ఈ వార్తలతో బీఆర్‌ఎస్ నాయ‌కులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకుని సంబరాలు జ‌రుపుకున్నారు.జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, బిఆర్‌ఎస్ మహిళా నేతకు షరతులతో కూడిన బెయిల్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :28 August 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు.. క‌విత కేసు వాదించిన‌ ముకుల్ రోహత్గీ ఫీజు ఎంతో తెలుసా ?

Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్ట‌కేల‌కు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు అయింది. మంగళవారం సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమెకు తాత్క‌లిక ఉపశమనం లభించింది. ఈ వార్తలతో బీఆర్‌ఎస్ నాయ‌కులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకుని సంబరాలు జ‌రుపుకున్నారు.జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, బిఆర్‌ఎస్ మహిళా నేతకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మహిళకు బెయిల్ మంజూరు చేయడం సాధారణ ఆచారం అని గమనించి, సంబంధిత సెక్షన్‌లను ఉటంకిస్తూ తీర్పును వెలువ‌రించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ప్రమేయం ఉందని పేర్కొంటు మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క‌విత‌ను అరెస్టు చేసింది. అప్ప‌టినుంచి ఆమె ఐదు నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. ఒక నెల తర్వాత సీబీఐ కూడా అదే కేసులో ఆమెపై కేసు పెట్టింది.జైలులో ఉన్న సమయంలో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. రెండుసార్లు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కవిత ఇప్పటికే ఐదు నెలల పాటు జైలు జీవితం గడపడం కూడా ఆమెకు బెయిల్ రావడానికి దోహదపడింది. ఐదు నెలల జైలు శిక్షను కూడా న్యాయమూర్తులు ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ విచారణ ఎప్పుడైనా పూర్తికాదని భావిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.

భారత మాజీ అటార్నీ జనరల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ కల్వకుంట్ల కవిత తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప‌లు విచార‌ణ‌ల అనంత‌రం ఆమె బెయిల్ లభించింది.కవితకు బెయిల్ రావడంతో ముకుల్ రోహత్గీ గురించి మరోసారి దేశవ్యాప్తంగా చ‌ర్చ‌ నడుస్తోంది. రోహిత్గీ ముంబైలోని ప్రభుత్వ లా కాలేజీలో ఎల్.ఎల్.బీ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో లాయర్ వసుధను వివాహం చేసుకున్నారు. వీరికి నిఖిల్ రోగత్గీ, సమీర్ రోహత్గీ ఇద్దరు కుమారులున్నారు. ముకుల్ రోహత్గీ 2014 నుంచి 2017 వరకూ భారత అటార్నీ జనరల్ గా ప‌ని చేశారు. ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్ కౌంటర్ కేసు, ఆధార్ వంటి పలు విజయవంతమైన కేసులను ఆయ‌న‌ వాదించారు.

Kavitha ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు క‌విత కేసు వాదించిన‌ ముకుల్ రోహత్గీ ఫీజు ఎంతో తెలుసా

Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు.. క‌విత కేసు వాదించిన‌ ముకుల్ రోహత్గీ ఫీజు ఎంతో తెలుసా ?

దేశవ్యాప్తంగా హై ప్రొఫైల్ కేసులే ముకుల్ రోహ‌త్గీ వాదిస్తారని పేరుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై జైల్లో ఉన్నప్పుడు బెయిల్ తెప్పించిందీ రోహిత్గీనే. జగన్ కు బెయిల్ వచ్చేలా వాదించినవారిలో రాం జఠ్మలానీ తర్వాత ముకుల్ రోహత్గీదే కీలక పాత్ర. ఈయన గంటకు సుమారు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు వరకూ ఫీజు తీసుకుంటారని స‌మాచారం. అది కూడా కేసు తీవ్ర‌త‌ను బ‌ట్టీ మారుతూ ఉంటుందంటారు. అంటే కవిత బెయిల్ విషయంలో ఆయన నిమిషానికి రూ.17 వేల చొప్పున ఫీజు వసూలు చేశారన్న‌మాట‌.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది