Women : గుడ్‌న్యూస్… మహిళలకే 50 శాతం అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..!
ప్రధానాంశాలు:
Women : గుడ్‌న్యూస్... మహిళలకే 50 శాతం అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..!
Women : ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50శాతానికి పైగా మహిళలకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించింది. రాబోయే రోజుల్లో క్రమంగా ఈ శాతాన్ని పెంచాలని సూచించింది. ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్‌మిల్లులు, గోదాములను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఇప్పటికే మహిళా సంఘాలు ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచితే, వారే ధాన్యాన్ని కొని, నిల్వ చేసి, మరాడించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేయవచ్చని, తద్వారా మహిళా సాధికారతను సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించే ప్రకియ్రలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), స్వయం సహాయక సంఘాలు (ఐకేపీ) క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి.

Women : గుడ్‌న్యూస్… మహిళలకే 50 శాతం అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..!
ఈ యాసంగిలో ధాన్యం సేకరణకు 8,218 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 4,455 పీఏ సీఎ్‌సల పరిధిలో ఉన్నాయి. 3,084 కేంద్రాలు ఐకేపీ(ఇందిరా క్రాంతి పథకం) మహిళా సంఘాల చేతిలో ఉన్నాయి. మరో 679 సెంటర్లు మెప్మా, ఎఫ్‌పీవోల పరిధిలో నిర్వహించనున్నారు. అయితే, నిజామాబాద్, పెద్దపల్లి లాంటి కొన్ని జిల్లాల్లో మహిళలు నిర్వహించే కొనుగోలు కేంద్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో, ఆయా జిల్లాల కలెక్టర్లు కనీసం 50ు కొనుగోలు కేంద్రాలు మహిళల ఆధ్వర్యంలో నడిచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాసంగిలో 4వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ధాన్యం సేకరణలో పాల్గొన్న సహకార సంఘాలు, మహిళా సంఘాలకు ప్రభుత్వం 2ు కమీషన్ ఇస్తోంది. వానాకాలంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రూ.11 వేల కోట్ల విలువైన ధాన్యం సేకరణ జరిగింది. పీఏసీఎ్‌సలు, ఐకేపీ, మెప్మా సెంటర్లకు ప్రభుత్వం రూ.220 కోట్ల కమీషన్ చెల్లించింది. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సింహభాగం కమీషన్ వాటికే వెళ్లింది. కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాల భాగస్వామ్యాన్ని పెంచితే వారికి కమీషన్ రూపంలో కూడా లబ్ధి చేకూరి మహిళా సంఘాలు బలోపేతం అవుతాయి.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల సొసైటీ కార్యదర్శులు, సిబ్బంది సస్పెన్షన్‌కు గురయ్యారు. ధాన్యం కొనుగోలులో పాలకవర్గాల జోక్యం కూడా మితిమీరుతోంది. రైస్‌మిల్లర్లతో కుమ్మక్కై తరుగు, తాలు, తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలులో పీఏసీఎ్‌సల పాత్రను తగ్గించి మహిళా స్వయం సహాయక సంఘాలకు కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.