Tribals Troubles : చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గిరిజనుల కష్టాలు.. ప్రాణాలకు తెగించి వాగు దాటితేనే ప్రాణాలు దక్కుతాయి..వీడియో
Tribals Troubles : ఇది వర్షాకాలం. కాస్తో కూస్తో వర్షం పడినా కూడా చిన్న చిన్న వాగులు పొంగుతాయి. రోడ్ల మీదికి వరద వస్తుంది. సిటీల్లో ఉండేవాళ్లకు, పట్టణాలు, నగరాలు, టౌన్స్ లో ఉండేవాళ్లకు వర్షాల వల్ల పెద్దగా నష్టమేమీ ఉండదు. వాళ్లకు కావాల్సిన వస్తువులన్నీ అక్కడే దొరుకుతాయి. అనారోగ్యం వచ్చినా కూడా ఆసుపత్రులు ఉంటాయి. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మరి.. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల పరిస్థితి ఏంటి. ఆదివాసీల పరిస్థితి ఏంటి. అడవుల్లో ఉండేవారి పరిస్థితి ఏంటి. చిన్న వర్షాలకే అక్కడ వాగులు, వంకలు ఉప్పొంగుతాయి. అప్పుడు ఎవరికైనా ఏదైనా అయితే ఆసుపత్రికి ఎలా వెళ్లాలి. ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లాలి. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా.. పక్కనే ఉన్న వేరే గ్రామానికి వెళ్లాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా ఇబ్బందే. దానికి కారణం.. అక్కడ ప్రవహించే వాగులు. భారీ వర్షం పడితే మాత్రం అక్కడి వాగుల ప్రవాహం పెరుగుతుంది. అవి దాటడానికి బ్రిడ్జీలు గట్రా ఏం ఉండవు. ఖచ్చితంగా ప్రాణాలకు తెగించి ఆ వాగు దాటితేనే అటువైపు వెళ్లగలరు.
ప్రస్తుతం మన్యం జిల్లాలో అలాంటి పరిస్థితే ఉంది. అక్కడ ఉండే గిరిజనుల బాధలు అంతా ఇంతా కాదు. వాళ్లు అనారోగ్యం బారిన పడినా ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి. పక్కనే ఉండే గ్రామానికి వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి. సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. ఇప్పటికీ మన్యం జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సరైన రోడ్ సౌకర్యం లేదు. చెట్లు, గుట్టలు దాటుకొని వెళ్లాలి. గిరిజనులు తమ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం లేక చాలా కష్టాలు పడుతున్నారు. గర్భిణీలకు పురిటి నొప్పులు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే డోలీలో వేసుకొని మోసుకుంటూ వాగులు దాటుతూ కిలోమీటర్లకు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి.
Tribals Troubles : చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తూ ఇబ్బందులు పడ్డ గిరిజనులు
ఓ చిన్నారికి అనారోగ్యం వస్తే తనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ.. భారీ వర్షాల వల్ల.. అక్కడ నాగావళి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వెదురు బొంగులతో చిన్న తెప్పను తయారు చేసి పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు అక్కడ రోజూ జరుగుతూనే ఉంటాయి. అర్జెంట్ గా వైద్యం అవసరం అయితే అక్కడ ప్రాణాలు పోవాల్సిందే. డాక్టర్ వచ్చే అవకాశం ఉండదు. వీళ్లు తీసుకెళ్లే అవకాశం కూడా ఉండదు. కానీ.. ఆ పాప తల్లిదండ్రులు వెదురు బొంగులతో చిన్న తెప్పను తయారు చేయడం వల్ల ఆ పాప ప్రాణాలను దక్కించుకోగలిగారు. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.