Viral News : ఓకే బైక్ పై ఏడుగురు కుర్రాళ్ళు.. ప్రాణాలు రిస్కులో పెట్టి మరీ రీల్స్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral News : ఓకే బైక్ పై ఏడుగురు కుర్రాళ్ళు.. ప్రాణాలు రిస్కులో పెట్టి మరీ రీల్స్…!

 Authored By aruna | The Telugu News | Updated on :9 October 2023,4:00 pm

Viral News : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా సామాన్య ప్రజలు కూడా సెలబ్రిటీలు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెడుతున్నారు. జనాలలో క్రేజ్ తెచ్చుకోవడానికి షార్ట్స్, రీల్స్ చేస్తూ నానా తిప్పలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో పాపులర్ కావటానికి మితిమీరిన పనులు చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడడమే కాకుండా పక్క వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వారి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఒకే బైక్ పై ఏడుగురు యువకులు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక బైకు మీద ఇద్దరు లేదా ముగ్గురు కూర్చొని ప్రయాణం చేయడం చూసాం. కొన్నిసార్లు నలుగురు కూడా ప్రయాణించడం చూసాం. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒకే బైక్ పై ఏడుగురు కుర్రాళ్ళు ప్రయాణించడం చూసి అంత షాక్ అయిపోతున్నారు.

Viral News Young boys bike ride for reels

Viral News Young boys bike ride for reels

పాత స్ప్లెండర్ బైక్ పై నలుగురు కుర్రాళ్ళు కూర్చున్నారు. అలాగే బైకు కు అటు ఇటు ఇద్దరు, బైక్ కు చివర్లో ఓ కుర్రాడు వేలాడుతూ కూర్చున్నాడు. ఏమాత్రం భయం లేకుండా కుర్రాళ్ళు రోడ్డుమీదికి వచ్చేసారు. వీళ్లను చూసి రోడ్డుపై వెళ్లే వాళ్లంతా ఆశ్చర్యపోయారు. కొందరు వాహనదారులు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీనిపై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేశారు. పవర్ ఆఫ్ స్ప్లెండర్ అని కొందరు, పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే అందరూ ఎగిరిపడతారని మరికొందరు, ఇలాంటి రిస్కులు చేయడం అవసరమా అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది