Vishakatapatnam.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం
ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, అది మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న (శనివారం) అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా అది మరింత బలపడి వాయుగుండంగా మారనుందని, దాంతో దక్షిణ ఒడిశా, ఒడిశా ప్రాంతాల మీదుగా మధ్యప్రదేశ్, విదర్భ వైపు వాయుగుండం వెళ్లనుంది. దాని ప్రభావం రాష్ట్రంపై అంతంత మాత్రంగానే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.
ఇకపోతే గుజరాత్ సమీపంలో అరేబియా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండటం వల్ల తేమ గాలులు రాష్ట్రం వైపుగా వస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు, జలశాయలు నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలోనే అధికారులు ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. వాగులు, వంకలు అయితే పొంగి పొర్లుతున్నాయి.