Nagababu : నాగ‌బాబును మంత్రిగా చేయ‌డం వెనుక‌ ప‌వ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagababu : నాగ‌బాబును మంత్రిగా చేయ‌డం వెనుక‌ ప‌వ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 December 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Nagababu : నాగ‌బాబును మంత్రిగా చేయ‌డం వెనుక‌ ప‌వ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే..!

Nagababu : ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకు తండ్రి – కుమారుడు, తాజా అన్నా – తమ్ముడు. మంత్రివర్గంలోని మెగా బ్రదర్ నాగబాబు ను తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్ల ప్రకారం 25 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్‌లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఇప్పుడు ఏపీ కేబినెట్‌లోకి నాగబాబును కూడా తీసుకోనున్నట్లు సమాచారం. మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని నాగబాబుకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Nagababu నాగ‌బాబును మంత్రిగా చేయ‌డం వెనుక‌ ప‌వ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే

Nagababu : నాగ‌బాబును మంత్రిగా చేయ‌డం వెనుక‌ ప‌వ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ఇదే..!

Nagababu మ‌రో మంత్రి..

పవన్ కళ్యాణ్ అంటే నాగబాబు ప్రాణాలిస్తారు. తమ్ముడిపై ఆయన ఈగ వాలనివ్వరు. రాజకీయాలపై తొలి నుంచి అవగాహన ఉండటంతో పాటు కాపు సామాజికవర్గం, చిరంజీవి అభిమాన సంఘాలతో నాగబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేడర్‌ను నడిపించారు నాగబాబు. ఈ నేపథ్యంలోనే ఆయనను జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో టీడీపీ , బీజేపీలతో పొత్తు ఉండటంతో అభ్యర్ధుల ఎంపిక, పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే వ్యవహారాలు నాగబాబు పర్యవేక్షించారు.

తాజా పార్లమెంట్ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీకి నాగబాబు సిద్దమయ్యారు. ఆ సమయంలో అనకాపల్లి సీటు బీజేపీకి ఇవ్వాల్సి రావటంతో..చివరి నిమిషంలో నాగబాబు కు అవకాశం దక్కలేదు. ఇక, తాజాగా ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇస్తారని ప్రచారం సాగినా.. కూటమిలో చోటు చేసుకున్న పరిణామాలతో ఒకటి బీజేపీ, రెండు టీడీపీకి ఖాయమయ్యాయి. దీంతో, రాజ్యసభ స్థానం కూడా నాగబాబుకు దక్క లేదు. దీంతో, చంద్రబాబు అనూహ్యంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు పవన్ తో చర్చల తరువాత ప్రకటన చేసారు.టీటీడీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబును నియమిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే టీటీడీ ఛైర్మన్ పదవి బీఆర్ నాయుడికి దక్కింది. ఇప్పుడు రాజ్యసభకు పంపుతారంటూ వార్తలు రాగా.. ఈ ఛాన్స్ కూడా తప్పిపోయింది. ఈ నేపథ్యంలోనే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుని సముచిత స్థానం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై కొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది