YS Jagan : బీజేపీ కోసం ఏపీ అసెంబ్లీని రద్దు చేయబోతున్న జగన్.. అదే జరిగితే?
YS Jagan : ప్రస్తతం దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల హడావుడి మొదలైంది. జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. అందుకే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను కూడా పెట్టడానికి సిద్ధం అవుతోంది కేంద్రం. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది. 2024 లో కాకుండా ముందే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ.. ఎందుకు వెనకడుగు కూడా వేస్తోంది. నిజానికి ఢిల్లీకి వెళ్లి సీఎం జగన్ దీని గురించే కేంద్రంలో పలుమార్లు చర్చించారు కానీ.. ఆ ప్రయత్నాలేవీ ముందు పడలేదు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నది. అది ఇంకా పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి గెలిచి సత్తా చాటాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అంటే వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన ఎన్నికలు జనవరిలోనే జరిగే చాన్స్ ఉన్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. దాన్ని బట్టి జగన్ కూడా నిర్ణయం తీసుకోనున్నారు. జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే వచ్చే జనవరిలోనే ఏపీకి కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. ఎలాగూ జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నారు కాబట్టి.. జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీ అసెంబ్లీని జగన్ రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది.అయితే.. జమిలీ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
YS Jagan : జమిలీ ఎన్నికలకు తాము ఓకే అంటూ సంకేతాలు పంపిస్తున్న జగన్
కానీ.. జగన్ మాత్రం జమిలీ ఎన్నికలు మాకు ఓకే అన్నట్టుగా కేంద్రానికి సంకేతాలు పంపిస్తున్నారు. ఏది ఏమైనా ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే వాటితో పాటే ఏపీలోనూ ఎన్నికలు జరపాల్సిందే.మరోవైపు తెలంగాణ ఎన్నికలకు జమిలితో జరిగే చాన్స్ ఉంది. నిజానికి ఈ డిసెంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు జరగాలి కానీ.. జమిలీ ఓకే అయితే ఒకేసారి అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి.