YS Jagan Mohan Reddy : వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లోకి రాకుండా ఓ పెద్దమనిషిని రంగంలోకి దింపిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan Mohan Reddy : వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లోకి రాకుండా ఓ పెద్దమనిషిని రంగంలోకి దింపిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!!

 Authored By anusha | The Telugu News | Updated on :1 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan Mohan Reddy : వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లోకి రాకుండా ఓ పెద్దమనిషిని రంగంలోకి దింపిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!!

YS Jagan Mohan Reddy : గెలుపే లక్ష్యంగా 2024లో మళ్లీ సీఎం అవ్వాలని వై.యస్.జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళుతుంటే వై.యస్.షర్మిల ఆయనకు స్పీడ్ బ్రేకర్ వేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీలోకి వై.యస్.షర్మిల రాబోతుందని తన సొంత అన్న పాలన గురించి మాట్లాడబోతున్నారని, గతంలో తనకు జరిగిన అన్యాయం గురించి, ఆస్తుల విషయాల గురించి, వివేకానంద హత్య కేసు గురించి షర్మిల చెబితే కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై ప్రభావం పడుతుంది. వై.యస్.షర్మిల కనుక పోటీ చేస్తే జగన్ సీఎం అవ్వలేరు. ఇలా వై.ఎస్.షర్మిల రావాలని, వైసీపీ పార్టీని దెబ్బ కొట్టాలని తెలుగుదేశం పార్టీ చూస్తుంది. ఇదే కనుక జరిగితే వై.ఎస్.షర్మిల ఏపీలోకి అడుగుపెడితే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి దెబ్బ పడటం ఖాయం. అయితే వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను గుంపుగా చేసి వై.యస్.షర్మిల ను, వై. ఎస్. విజయమ్మను కన్విన్స్ చేయడానికి హైదరాబాద్ పంపించారని టాక్.

ఈ విషయాన్ని వై.యస్.షర్మిల అర్థం చేసుకొని వైసీపీ వైపు నిలబడితే ఆస్తి పంపకాల విషయంలో ఉన్న ఇబ్బందులతో పాటు కడప ఎంపీ సీటు వైసీపీ తరఫున ఆఫర్ చేస్తే ఆమె ఒకవేళ ఒప్పుకుంటే ఎంపీ సీటు ఇస్తామని, ఒకవేళ ఓడిపోయిన రాజ్యసభ సీటును ఇస్తామని ప్రామిస్ తో వై.యస్.షర్మిలను అప్రోచ్ అవనున్నారట. లేదంటే వై.యస్.షర్మిలను ఏపీలోకి రానివ్వకుండా చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారట. ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని కాంగ్రెస్ పోటీకి రావడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదని అంటున్నారు. అయినా కూడా వై.యస్..షర్మిలను, బ్రదర్ అనిల్ ను, వై.ఎస్ విజయమ్మను కన్విన్స్ చేయడానికి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, భాస్కర్ రెడ్డి, కెవిపి వాళ్లను పంపించి కన్విన్స్ చేయడానికి చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే అందుకు షర్మిల ఒప్పుకుంటారా లేక వై.యస్.జగన్మోహన్ రెడ్డి షర్మిల కలిసిపోతారా లేక వై.యస్.షర్మిల రాజకీయాలకు దూరంగా ఉంటారా అనేది చూడాలి. వైయస్సార్ సీపీ పార్టీకి కూటమిగా ఏర్పడిన జనసేన, టీడీపీ పార్టీకి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఇలాంటి సమయంలో వై.యస్.షర్మిల తన అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తే వైసీపీకి దెబ్బ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కి అంత బలం లేదని చెప్పాలి. గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ కి ఒకటి శాతం మాత్రమే ఓట్లు నమోదు అయ్యాయి. ఇప్పుడు కూడా అంతకన్నా తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వై.యస్.షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది