YS Sharmila : తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించేసాం… నెక్స్ట్ నువ్వే… వై.యస్.జగన్ కు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్…!
ప్రధానాంశాలు:
YS Sharmila : తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించేసాం... నెక్స్ట్ నువ్వే... వై.యస్.జగన్ కు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్...!
YS Sharmila : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల రసవతరంగా మారుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వై.యస్.ఆర్ కుటుంబం మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తన సొంత చెల్లెలు వైయస్ షర్మిల మరియు సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇదివరకే వైయస్ సునీత తన తండ్రి వివేకానంద హత్య కేసులో జగన్ పాత్ర , అవినాష్ రెడ్డి పాత్ర ఉందంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని వైయస్ షర్మిల కూడా ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ తెలియజేశారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ వివేకానంద హత్య కేసు పై సునీత మరియు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తూ జగన్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.
YS Sharmila అవినాష్ రెడ్డి హత్య చేయకపోతే సాక్షాలను ఎందుకు చెరపాలి
ఈ నేపథ్యంలోనే మరోసారి వైయస్ షర్మిల వివేకానంద హత్య కేసు పై మాట్లాడుతూ జగన్ మరియు అవినాష్ రెడ్డి పై మండిపడ్డారు. సీబీఐ అధికారులతో అవినాష్ రెడ్డి ఉన్న ఫోటోలు చూపిస్తూ… అవినాష్ రెడ్డి నిజంగా హత్య చేయకపోతే బాడీ ని ఎందుకు క్లీన్ చేస్తున్నారు , సాక్షాలను ఎందుకు మాయం చేస్తున్నారంటూ షర్మిల ప్రశ్నించారు. వివేకానంద కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా చేర్చింది. దానికి సంబంధించిన ఫోటోలను ఎందుకు మాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ షర్మిల మండిపడ్డారు. నిందితులను మీరు పక్కన పెట్టుకొని సాక్షాలు తుడిచేస్తూ సీబీఐ పక్కన అవినాష్ రెడ్డి అమాయకుడిగా నిలుచున్నారని మీరే చెబుతూ.. తిరిగి మీరే నిందితులకు టికెట్లు ఇవ్వడమేంటి అంటూ ఆమె ప్రశ్నించారు.
ఇక నేను తెలంగాణలో పార్టీ పెట్టి దానిని వదిలి మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చానని నా సొంత మామ విమర్శలు చేస్తున్నారు. అయ్యా మేనమామ గారు నేను తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించింది ఒక నియంతను దించడానికి. నా పని అక్కడితో అయిపోయింది. కేసీఆర్ అనే నియంతను దించేశాం. ఇక ఇప్పుడు నాకు ఆంధ్ర రాష్ట్రంలో పని పడింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడికి వచ్చినట్లుగా షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి గల కారణం మీరు జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, ప్రత్యేక హోదాన విస్మరిస్తే మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపడానికే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా షర్మిల తెలిపారు. ఇక కడప జిల్లా నుండి తాను పోటీ చేయడానికి గల కారణం రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముని దారుణంగా నడిరోడ్డుపై గొడ్డలితో చంపిన నిందితులను కాపాడుతూ కడప వేదికగా వారి అధికారాన్ని పెంచుతుంటే చూసి తట్టుకోలేని వైయస్ రాజశేఖర్ బిడ్డ ఇక్కడ నిలబడింది అంటూ షర్మిల ఉద్ఘాటించారు.