YS jagan Agenda Song : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న జగన్ అజెండా సాంగ్…!
ప్రధానాంశాలు:
YS jagan Agenda Song : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న జగన్ అజెండా సాంగ్...!
YS jagan Agenda Song : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైనాట్ 175 అనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు సమీకరణలతో గెలుపు వైపుగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా అభ్యర్థులను కూడా మార్చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తున్నారు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఆదరణ ప్రజలలో విపరీతంగా పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు కూడా డిజిటల్ ప్రచారానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా డిజిటల్ ప్రచారాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి ముఖ్యంగా గులాబీల జెండాలమ్మ అనే పాట పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే తరహాలో రాజకీయ నేతలు డిజిటల్ ప్రచారానికి తెర లేపుతున్నారు.
ఈ క్రమంలోనే ఒకవైపు అభ్యర్థుల కసరత్తు చేస్తూ జాబితాలు విడుదల చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో వైపు డిజిటల్ ప్రచారానికి పుణుకుంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే లిరిక్స్ తో ఉర్రూతలూగించే మ్యూజిక్ తో అద్భుతమైన పాటను తాజాగా విడుదల చేసింది. జగనన్న అజెండా అనే పేరుతో విడుదలైన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ పాటను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అయితే ఈ పాట ఒకవైపు లిరిక్స్ తో మరోవైపు జగన్ వ్యాఖ్యలతో సాగుతూ వస్తుంది. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపు ఉన్నాడు చెప్పుకోడానికి ఏమీ లేని వారంతా ఏకమవుతున్నారు అనే వ్యాఖ్యలతో పాట ప్రారంభం కాగా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు తోడుగా నిలవండి ,మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు సైనికులుగా కదలండి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో పాట అందర్నీ ఆకర్షిస్తుంది. ఇక ఈ పాటను నల్గొండ గద్దర్ తనదైన శైలిలో పాడగా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన తమ్ముడు జగన్.
అంటూ సాగే ఈ పాటకు ప్రజలలో మంచి స్పందన లభిస్తుంది..జెండాలు జతకట్టడమే మీ అజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా అనే లిరిక్స్ అందర్నీ ఆలోచింపజేస్తున్నాయని చెప్పాలి.అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలుగా జగన్ చేసిన పథకాలన్నీ గుర్తు చేయడమే కాక ప్రతిపక్షాల తీరును కూడా ఈ పాట ఎండగడుతూ సాగుతుంది. పాట లిరిక్స్ మధ్యలో జగన్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను కూడా పెట్టడంతో పాటకు హైలెట్ గా నిలిచాయని చెప్పాలి. మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో మొదటిసారిగా జనంలోకి విడుదలైన జగనన్న అజెండా పాట విస్తృతంగా ప్రజల ఆదరణ పొందుతుందని చెప్పాలి. మరి ఈ పాటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.