Business Idea : ఈ బిజినెస్ తో లక్షల్లో ఆదాయం పొందండి ఇలా…!
Business Idea : కిరాణా షాప్ బిజినెస్ అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది. కిరాణా షాప్ పెట్టడానికి సరైన ప్లేస్ ని ఎంచుకోవాలి. ఆ ప్లేస్లో కనీసం 100 ఫ్యామిలీలు ఉండేటట్లు చూసుకోవాలి. అక్కడ మరి ఏ షాపులు ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ అక్కడ కిరాణా షాప్ ఉంటే దానికంటే బెస్ట్ గా పెట్టేటట్లు చూసుకోవాలి. ఎప్పుడూ కూడా బిజినెస్ చేయడానికి మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. 50% మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకి 10 లక్షల్లో ఐదు లక్షలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి.
ఎప్పుడైతే బిజినెస్ రన్ అవుతుందో నాలెడ్జ్ పెరుగుతుందో అప్పుడు ఇన్విస్ట్మెంట్ అనేది పెట్టుకుంటూ పోవాలి. షాప్ పెట్టిన తర్వాత మార్కెటింగ్ చేసుకోవాలి. చుట్టుపక్కల పల్లెటూర్లు ఉంటే అక్కడ పాలను ఎటువంటి చార్జెస్ లేకుండా డెలివరీ చేయాలి. వీలైతే వాళ్లకు ఒకసారి మేము షాప్ ఓపెన్ చేసాం అని చెప్పాలి. హోల్ సేలర్లతో పరిచయాలు ఏర్పరచుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా తగ్గుతుంది. కస్టమర్ తో మంచి రిలేషన్షిప్ ని కలిగి ఉండాలి. డోర్ డెలివరీ చేయడం వలన కస్టమర్స్ ని పెంచుకోవచ్చు. కిరాణా షాప్ లో ప్రాఫిట్స్ విషయానికి వస్తే అక్కడున్న ప్లేస్ ను బట్టి ఫ్యామిలీస్ ని బట్టి 10 శాతం రాబడి వస్తుంది.
కిరాణా షాప్ అనేది ప్రతిరోజు వాడే వస్తువులు కాబట్టి లాభదాయకంగా ఉంటుంది.కిరాణా షాప్ కి నిత్యం పిల్లలు ఎంతోమంది వస్తుంటారు. కాబట్టి షాప్ లో వివిధ రకాల ఐటమ్స్, స్టేషనరీ పెట్టాలి. మహిళలకు సంబంధించిన వస్తువులను పెట్టాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇల్లును నడిపేది స్త్రీ మాత్రమే కాబట్టి. అందుకనే ఆ వస్తువులను తప్పనిసరిగా పెట్టాలి. కిచెన్ సంబంధిత వస్తువులు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఎవరైనా కస్టమర్ మన స్టోర్ లో ఏదైనా అడిగినప్పుడు అది ఒకవేళ లేకపోతే నేను సాయంత్రం వరకు తెప్పిస్తాను అని చెప్పాలి. ఇలా బిజినెస్ ని కొనసాగిస్తే లక్షల ఆదాయాన్ని పొందవచ్చు.