Business ldea : పోషకాలతో కూడిన లడ్డులను తయారు చేసి అమ్ముతూ 2 కోట్లు సంపాదించిన తల్లీకొడుకు.. ఎక్కడో తెలుసా?
Business ldea : ఒక్కో సారి మనం ఏమాత్రం ఊహించని రంగంలో విజయం సాధిస్తాం. అద్భుతమైన పనితీరునూ కనబరుస్తాం. కొద్ది మంది దానినే మంచి వ్యాపారంగా మలచుకుంటారు. అందులో గొప్ప విజయాలను అందుకుంటారు రాజస్థాన్ కోటలోని మోదక్ లో పుట్టిన అల్పనా తివారీ జీవితంలోనూ అనుకోనిది జరిగింది. అది ఆమెను విజయతీరాలకు చేర్చింది. అల్పనా తివారీ తండ్రి ప్రభుత్వ వైద్యుడు. విధుల్లో భాగంగా ఆయన రాజస్థాన్ లోని చోము జిల్లాకు వెళ్లాల్సి వచ్చింది. ఆ చోము జిల్లాలోనే అల్పనా తివారీ బాల్యం గడిచింది. చిన్నప్పటి నుండి తండ్రిని చూస్తూ పెరిగిన అల్పనా… పెద్దయ్యాక తండ్రిలాగే సాంప్రదాయ వైద్యురాలిగా గుర్తింపు పొందాలని కోరుకునేది. సంస్కృతానని ఎంచుకుని అందులో ప్రావీణ్యం సంపాదించేందుకు ప్రయత్నించింది. చిన్నప్పటి నుండి వైద్యురాలు అవ్వాలనుకున్న తివారీ..
యుక్త వయస్సు వచ్చే సరికి మనసు మార్చుకుంది. ఏదైన వ్యాపారంలో స్థిర పడాలని అనుకునేది. ఒక వేళ వైద్యురాలిగా మారితే విధులు నిర్వర్తించేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కానీ, అల్పనాకు అది ఏమాత్రం ఇష్టం లేదు. తను అదే ఊర్లో ఉండాలనుకునేది.అందు కోసం ఆమె ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడాలనుకుంది. పెళ్లయ్యాక ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ సమయంలోనే ఇతర గర్భిణీలకు సాయం చేయడం ప్రారంభించింది. గర్భం దాల్చిన సమయంలో వారికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలిసేది కాదు. వారికి పోషకాహారాన్ని అందించడం మొదలు పెట్టింది అల్పనా. తన గైనకాలజిస్ట్ డాక్టర్ సంతోశ్ యాదవ్ ఒత్తిడి మేరకు ఆమె ఇతర మహిళలకు సాయం చేయండ ప్రారంభించింది. పోషకాహారం లడ్డూలు కావాలనుకునే వారు ఆ పదార్థాలను ఆమెకు డెలివరీ చేసి లడ్డూలు తయారయ్యాకి తిరిగి తీసుకెళ్లే వారు.
వార్త వ్యాప్తి చెందడంతో, ఆ ప్రాంతంలోని అనేక ఇతర వైద్యులు వారి పోషకాహార అవసరాలను తీర్చడానికి వారి రోగులను అల్పనా వద్దకు పంపడం ప్రారంభించారు.ఇదంతా 2009లో జరిగింది. ఆమె చేస్తున్న ఈ పని గురించి ఇంట్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. మూడు, నాలుగేళ్ల తర్వాతే తను చేస్తున్న పని గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. ఆమె చేస్తున్న వ్యాపారం చక్కగా నడిచింది. మంచి ఆదాయం కూడా వచ్చేది. మెకానికల్ ఇంజినీర్ అయిన అల్పనా కుమారుడు విరాల్ తివారీ బెంగళూరులో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వచ్చాడు. 2019 లో తన తల్లితో కలిసి ఆ బిజినెస్ ను విస్తరించాలనుకున్నాడు. 2019లో రూ. 20 వేల పెట్టుబడితో నుస్కా కిచెన్ ను ప్రారంభించారు తల్లీ కొడుకులు. తమ ఉత్పత్తులను విస్తరించారు. ఓట్స్ లడ్డూ, శతావరి పొడి, కొబ్బరి లడ్డూ, రాగి లడ్డూలను తయారు చేశారు. కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ, తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది నుష్క కిచెన్ రూ. 2 కోట్ల ఆదాయం వస్తుందని వాళ్లు ఆశిస్తున్నారు. తాను చేసే పనిలో లాభాలు కాకుండా ఆత్మ సంతృప్తి చూస్తోంది అల్పనా.