Phalguna Masam : పాల్గుణ మాసంలో వచ్చే ముఖ్యత పండుగలు
Phalguna Masam : పాల్గుణ మాసం తెలుగు ఏడాదిలో చివరిది. ఈ మాసంలో వచ్చే పండుగలు, వ్రతాల గురించి తెలుసుకుందాం..
ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మాధుక వ్రతం చేస్తారు. ఈ మాస శుద్ధ చవితిని తిల చతుర్థి అని అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి తిలాన్నంతో హోమం చేసి బ్రాహ్మణ భోజనానంతరం భుజించాలి దీని వల్ల సర్వ విజ్ఞాలు నశిస్తాయి.
ఈ రోజు పుత్ర గణపతి వ్రతం ఆచరించిన వారికీ సంతానం కలుగుతుంది. పంచమి నాడు అనంత పంచమి వ్రతాన్ని, సప్తమి నాడు ఆర్కాసంపుట సప్తమిని ఆచరించాలి. పాల్గుణ శుద్ధ అష్టమి లక్ష్మిదేవికి ప్రీతికరమైన రోజు. ఈనాడు లక్ష్మీదేవిని, సీతాదేవిని అర్చించి, ప్రదోష సమయంలో దీపారాధన చేస్తే సౌభాగ్యం, సంపద కలుగుతాయి.ఈ రోజు లలితకాంతిదేవి వ్రతం చేస్తారు. నవమినాడు ఆనందనవమిని, ఏకాదశిని అమలక ఏకాదశిగా నిర్వహిస్తారు. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిధి. దీన్నే నృసింహ ద్వాదశి అని అంటారు. శ్రీ నృసింహ ఆరాధన చేస్తే అభిష్టసిద్ధి కలుగుతుంది.ఈ పర్వాన్ని కామదాహాని అని కూడా అంటారు. ఈ రోజు గ్రామ క్షేమం కోసం మన్మధ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశికి మహేశ్వర వ్రతం చేయాలి. హోళికా పూర్ణిమ నాడు పగలు గోక్రీడలు, సాయంత్రం హోలీ ఉత్సవం నిర్వహిస్తారు.
ప్రదోష సమయంలో దీపం వెలిగించి లక్ష్మీనారాయణ అర్చన చేస్తే సర్వ సంపదలు శుభాలు కలుగుతాయి. పౌర్ణమి తరువాత వచ్చేది పాడ్యమి ఆరోజు ధూళి వందనం చేయాలి. పాల్గుణ మాసంతో శీతాకాలం ముగిసి, వసంత కలం ప్రారంభం అవుతుంది. పాల్గుణ మాసంలో దేవత ఆరాధన, ఉత్సవాలతో పాటు పితృ ఆరాధన కూడా చేయాలనీ శాస్త్రం. పాల్గుణ మాసంలో ప్రవచనాలు వినడం, దేవాలయాలను సందర్శించడం మంచిది. ఎవరికి ఏ పూజ, వ్రతం, దానం ధర్మం చేయడానికి వీలు అవుతుందో దాన్ని ఆచరించి మాధవుడి అనుగ్రహం పొందండి. సన్మార్గం, భక్తిమార్గం కేవలం ఇహలోక సుఖాలనే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాయి.